ఒక్క దరఖాస్తు కూడా రీ ఓపెన్ కాకూడదు
ABN, Publish Date - Sep 10 , 2024 | 12:00 AM
: ఫిర్యాదులకు సంబంధించి ఒక్క దరఖాస్తు కూడా రీఓపెన్ కాకూడదని కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు.
సీఎంవో ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం తగదు
కలెక్టర్ పి. రంజిత్ బాషా
కర్నూలు(కలెక్టరేట్), సెప్టెంబరు 9: ఫిర్యాదులకు సంబంధించి ఒక్క దరఖాస్తు కూడా రీఓపెన్ కాకూడదని కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రీఓపెన్, ఇంకా చూడనివి, గడువు దాటిన కేసులపై సమీక్షించారు. రీఓపెన్ 37, ఇంకా చూడనివి 21, సీఎం గ్రీవెన్స్ 34, గడువు దాటినవి ఒక్క ఫిర్యాదు ఉన్నాయన్నారు. ఆదోని సబ్ కలెక్టర్, పత్తికొండ కర్నూలు ఆర్డీవోలు, డీపీవో, హౌసింగ్, కేసులు పంచాయతీ రాజ్ తదితర శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు రీఓపెన్ అయ్యాయని, వీటిని వెంటనే పరిష్కరించాలనిఆదేశించారు. ఆర్టీసీ, డీపీవో, వక్ఫ్, పంచాయతీరాజ్, ఆర్‌ఐవో, కర్నూలు, దేవనకొండ, ఎంపీడీవో కార్యాలయాలు, తదితర శాఖలన్నీ జాబితాలో ఉన్నాయని, వెంటనే వాటిని చూసి సమస్యలను పరిష్కరించాలన్నారు. సీఎంవో ఫిర్యాదులకు సంబంధించి ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏడు, కర్నూలు ఆర్డీవో కార్యాలయంలో ఏడు అత్యధికంగా పెండింగ్‌లో ఉన్నాయని, సీఎంవో గ్రీవెన్స్ పరిష్కారంలో అలసత్వం ఉండకూడదని అధికారులను హెచ్చరించారు.
వంద రోజుల లక్ష్యాలను సాధించేలా ప్రణాళిక: జిల్లా అభివృద్ధిలో భాగంగా వంద రోజుల లక్ష్యాలను మండల వారిగా విభజించి నిర్ణయించామని, ఈ లక్ష్యాల సాధనకు వీలుగా కార్యాచరణ ప్రణాళికను త్వరితగతిన అమలు చేయాలని జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, తహసీల్దార్లను ఆదేశించారు. శుక్రవారం ఎంపీడీవోలు, తహసీల్దార్లు, జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేస్తామని, సమీక్షకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా.బి. నవ్య, డీఆర్వో చిరంజీవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Sep 10 , 2024 | 12:00 AM