డీజీపీని కలిసిన నందికొట్కూరు ఎమ్మెల్యే
ABN, Publish Date - Jun 23 , 2024 | 12:10 AM
డీజీపీ తిరుమలరావును నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.
డీజీపీ తిరుమలరావును సన్మానిస్తున్న ఎమ్మెల్యే జయసూర్య
నందికొట్కూరు, జూన్ 22: డీజీపీ తిరుమలరావును నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనసభ సమావేశం రెండో రోజు పూర్తిన అనంతరం డీజీపీ తిరుమలరావును ఆయన చాంబర్‌లో కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఉన్న పలు సమస్యలపై చర్చించారు. ఎమ్మెల్యేతో పాటు పగిడ్యాల మండల కన్వీనర్ పలుచాని మహేశ్వర్‌రెడ్డి కూడా ఉన్నారు.
Updated Date - Jun 23 , 2024 | 12:10 AM