ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టీడీపీలో చేరిన మున్సిపల్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు

ABN, Publish Date - Jul 05 , 2024 | 11:56 PM

మున్సిపల్‌ చైర్మన్‌, వైసీపీ కౌన్సిలర్లు శుక్రవారం టీడీపీలో చేరారు.

నందికొట్కూరు, జూలై 5: మున్సిపల్‌ చైర్మన్‌, వైసీపీ కౌన్సిలర్లు శుక్రవారం టీడీపీలో చేరారు. నందికొట్కూరు పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి నివాసంలో వైసీపీకి చెందిన నందికొట్కూరు మున్సిపల్‌ చైర్మన్‌ దాసి సుధాకర్‌రెడ్డితోపాటు కౌన్సిలర్లు చిన్న రాజు, సురేష్‌, రావూఫ్‌, లాలుప్రసాద్‌, కోఆప్షన్‌ సభ్యుడు గఫార్‌ టీడీపీలో చేరారు. వైసీపీ వార్డు ఇన్‌చార్జి రామకృష్ణ, ఉస్మాన్‌బేగ్‌, సత్యనారాయణ, కురువ శ్రీనివాసులు, ప్రాతకోట రమేష్‌, రమేష్‌, రజినికుమార్‌రెడ్డి, వీరబొమ్మ శ్రీనివాసులు, రాజశేఖరప్ప, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ తెలిపారు. ఈ సందర్భంగా బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీ నిధులను కేటాయించి పట్టణాభివృద్ధికి సహకరిస్తామన్నారు. గత మూడేళ్లుగా నందికొట్కూరు పట్టణం అభివృద్ధికి నోచుకోలేదని, ఈ రెండేళ్లలో పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించాలని చైర్మన్‌, కౌన్సిలర్లకు బైరెడ్డి సూచించారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చైర్మన్‌ మాట్లాడుతూ కొందరు కౌన్సిలర్లు, ఇద్దరు కోఆప్షన్‌ సభ్యులు, పట్టణంలోని వార్డు ఇన్‌చార్జిలు టీడీపీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. మరో ముగ్గురు కౌన్సిలర్లు అనారోగ్యం కారణంగా ఇక్కడికి రాలేదని, త్వరలో వారు కూడా పార్టీలో చేరతారన్నారు. ఎంపీ బైరెడ్డి శబరికి సహకరిస్తూ, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సలహాలతో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 11:56 PM

Advertising
Advertising