గ్రామాభివృద్ధికే సభలు
ABN, Publish Date - Aug 24 , 2024 | 01:25 AM
గ్రామాల అభివృద్ధికే ప్రభుత్వం ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తోందని డీఎల్‌పీవో రాంబాబు తెలిపారు.
డీఎల్‌పీవో రాంబాబు
చాగలమర్రి, ఆగస్టు 23: గ్రామాల అభివృద్ధికే ప్రభుత్వం ప్రత్యేక గ్రామసభలు నిర్వహిస్తోందని డీఎల్‌పీవో రాంబాబు తెలిపారు. శుక్రవారం చాగలమర్రి మేజర్ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ తులశమ్మ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉపాధి నిధు లతో గ్రామాల్లో అభివృద్ధి చేపట్టనున్నట్లు తెలిపారు. పక్కా గృహాలకు విద్యుత, తాగునీటి కనెక్షన, మరుగుదొడ్ల సదుపాయం, మురుగు కాలువలు, వీధి దీపాలు, సిమెంట్ రహదారులు, డంపింగ్‌యార్డ్‌ల నిర్వహణపై ప్రజల తో చర్చించారు. అంతర్గత రహదారుల నిర్మాణంతో పాటు ఇంకుడు గుం తలు, కుంటల నిర్మాణం, పశువుల పెంపకంపై చర్చించారు. 19 గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారులచే గ్రామసభలు నిర్వహించారు. ఎస్‌ఐ రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా బీసీ కార్పోరేషన ఈడీ జాకీర్‌హుసేన, ఎంపీపీ వీరభద్రుడు, ఎంపీడీవో మహబూ బ్‌దౌల, ఉప సర్పంచ సోహెల్, ఈవోఆర్డీ తాహిర్‌హుసేన, కార్యదర్శులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
డోన(రూరల్): ఉపాధి హామీ పథకం పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమలాపురం గ్రామ సర్పంచ రేగటి అర్జున రెడ్డి, ఎనఆర్ ఈజీఎస్ ఏపీవో అబ్దుల్ షుకూర్ అన్నారు. శుక్రవారం కమలాపురం గ్రామం లో గ్రామ సభలు నిర్వహిం చారు. గ్రామంలో ఎనఆర్‌ఈజీఎస్ కింద చేపట్టే పనుల గురించి తీర్మానాలు చేశారు. అలాగే ఆవులదొడ్డి, వెంకటనాయు నిపల్లె, చిన్నమల్కాపురం, ఎర్రగుంట్ల, వెంకటాపురం, గుమ్మకొండ గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించారు. ఈసభల్లో మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఉయ్యాలవాడ: మండలంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించటమే గ్రామ సభల లక్ష్యం అని జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధి కారి, మండల ప్రత్యేక అధికారి సునీల్ అన్నారు. శుక్రవారం ఉయ్యాలవాడలో జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో తాగునీటి సమస్యలు మొదలుకొని రైతుల పొలాలకు రస్తాలు ఏర్పాటు వరకు అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పీయం సూర్యఘర్ గురించి విద్యుత ఏఈ గుర్రప్ప సభలో వివరించారు. ఎంపీపీ బుడ్డా భాగ్య మ్మ, ఎంపీడీవో ఉమమహేశ్వరరావు, తహసీల్దారు శ్రీనివాసులు, ఈవోపీఆర్డీ మహింధర్‌రెడ్డి, ఉపాధి ఏపీవో రవిప్రకాష్, టీడీపీ మండల కన్వీనర్ బోరెడ్డి శేఖర్‌రెడ్డి, నాయకులు ఆకుల నడిపి వెంటకసుబ్బయ్య, అర్జిగారి నరసిం హుడు, వెంకటస్వామి పాల్గొన్నారు.
రుద్రవరం: ఉపాధి హమీ పథకం గ్రామసభలు శుక్రవారం సాదాసీదాగా కొనసాగాయి. మండలంలోని 21 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించినట్లు ఎంపీడీవో మధుసూదనరెడ్డి తెలిపారు. మండలం లోని రుద్రవరం, నాగలవరం, కొండమాయపల్లె గ్రామ సభలను ప్రత్యేక అధికారి జిల్లా ఉద్యానశాఖాధికారి నాగరాజు పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఉప సర ్పంచ బండారు బాలరాజు, అఽధికా రులు, సర్పంచలు పాల్గొన్నారు.
కోవెలకుంట్ల: జాబ్‌కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి వంద రోజులు పనిదినాలు కల్పించాలని ఎంపీడీవో సయ్యదున్నీసా అన్నారు. శుక్రవారం కోవెలకుంట్ల పట్టణంలోని మేజరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ ఎం.సరళ, ఉప సర్పంచ సూర్యనారాయణరెడ్డి అధ్యక్షతన ఈవో గోపి నాఽథ్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామ పంచాయతీ అబివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. అలాగే మండ లంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఉదయం ఆయా సర్పంచల ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.
దొర్నిపాడు: మండలంలోని ఆయా గ్రామాల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉపాధి పనులు కల్పించాలని నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఉమామ హేశ్వరి అన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లోని సచివాలయాల్లో శుక్ర వారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై గ్రామసభలు నిర్వహిం చారు. అనంతరం ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. మండల ప్రత్యేక అధికారి, జేడీ గోవిందనాయక్, ఏపీడీ సాంబశివరావు, ఎంపీడీవో శ్రీని వాసులు, తహసీల్దార్ సుభద్ర, ఆయా గ్రామాల సర్పంచలు, మండల స్థాయి సిబ్బంది, మండల టీడీపీ నాయకులు భూమా బ్రహ్మానందరెడ్డి, సిద్ధి సత్యం, బొబ్బూరి వెంకటస్వామి, కొత్తపల్లి సురేంద్ర, లింగుట్ల వెంకట్‌నాయుడు, కాశీ విశ్వనాథ్‌రెడ్డి, అమరసింహారెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Aug 24 , 2024 | 01:25 AM