రాజోలి ఆనకట్ట వద్దకు చేరిన కృష్ణా జలాలు
ABN, Publish Date - Jul 31 , 2024 | 12:35 AM
మండలంలోని రాజోలి ఆనకట్ట వద్దకు మంగళవారం కృష్ణా జలాల వరద నీరు ఆనకట్టకు చేరాయి.
6,200 క్యూసెక్కుల నీటి ప్రవాహం
చాగలమర్రి, జూలై 30: మండలంలోని రాజోలి ఆనకట్ట వద్దకు మంగళవారం కృష్ణా జలాల వరద నీరు ఆనకట్టకు చేరాయి. శ్రీశైలం, పోతి రెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి వరద నీరు ఆనకట్టకు చేరింది. దీంతో కుందూ ఉధృతి పెరిగింది. ఆనకట్ట వద్ద కుందూనది 6,200 క్యూసెక్కుల నీటితో వ్రహిస్తున్నట్లు కేసీ కెనాల్ ఏఈ జమాల్‌వలి తెలిపారు. నెల రోజుల నుంచి సరైన వర్షాలు లేకపోయిన కృష్ణాజలాలు రావడంతో కుందూనది వరద నీటితో ప్రవహిస్తోందని అన్నారు. ఆనకట్ట వద్ద కేసీ కాలువకు గల ప్రధాన గేట్లను మూసి వేసి కడప జిల్లావైపు గల గేట్లను ఎత్తి కుందూకు నీరు విడుదల చేశామని అన్నారు. కుందూలో నీరు ప్రవహిస్తుండటంతో పరిసర గ్రామాల పొలాల్లోని బోర్లకు నీటి మట్టం పెరుగుతుందని అన్నారు. కేసీ ప్రధాన కాలువకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీరు విడుదల చేయనున్నట్లు తెలిపారు.
Updated Date - Jul 31 , 2024 | 12:35 AM