ఘనంగా కోట్ల విజయభాస్కర్‌రెడ్డి జయంతి
ABN, Publish Date - Aug 17 , 2024 | 01:06 AM
డోన పట్టణంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి 104వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనం గా నిర్వహించారు.
డోన, ఆగస్టు 16: డోన పట్టణంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి 104వ జయంతి వేడుకలను శుక్రవారం ఘనం గా నిర్వహించారు. పట్టణంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్య మంత్రిగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి చేసిన సేవలు మరులేనివని కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కోట్రికే ఫణిరాజ్, వలసల రామకృష్ణ, డీసీఎంఎస్ మాజీ చైర్మన లక్ష్మీరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన టీఈ కేశన్నగౌడు, మాజీ సర్పంచ కేశవయ్యగౌడు, మాజీ ఎంపీపీ శేషఫణిగౌడు, మున్సిపల్ వైస్ చైర్మన కోట్రికే హరికిషణ్, ఓబులాపురం శేషి రెడ్డి, మండల పార్టీ అధ్య క్షుడు శ్రీనివాసులు యాదవ్, భాస్కర్ నాయుడు, తూర్పు లిం గారెడ్డి, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్ని కోట్లకు నివాళి అర్పిం చారు.
ప్యాపిలి: పట్టణంలో దివం గత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి జయంతి వేడుకల సందర్భంగా టీడీపీ నాయకులు కేక్‌కట్ చేసి పంపిణీ చేసుకున్నారు. కార్యక్రమంలో డోన మార్కెట్ యార్డు చైర్మన రాజా నారాయణమూర్తి, ఖాజాపీర్, చల్లా వీరాంజి నేయులు, ఎస్ మధు, రాజారవి, కోదండరాము, ఎస్‌కే వలి తదితరులు పాల్గొన్నారు.
బేతంచెర్ల: టీడీపీ కార్యాలయంలో పార్టీ మండల కన్వీనర్ ఎల్ల నాగయ్య అధ్యక్షతన దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి చిత్ర పటానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఎల్ల నాగయ్య, తిరుమలేష్ చౌదరి, అంబాపురం గ్రామ సర్పంచ శ్రీనివాస్ యాదవ్, కేవీ సుబ్బారెడ్డి, రవీంద్ర నాయక్, మధు లోకేశ్వరరెడ్డి, నాగేశ్వరరెడ్డి, రూబెన పాల్గొన్నారు.
Updated Date - Aug 17 , 2024 | 01:06 AM