ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కాటసానికి ఓటు అడిగే హక్కు లేదు

ABN, Publish Date - May 04 , 2024 | 11:53 PM

కొలిమిగుండ్ల మండలంలో పేద, మధ్య తరగతి ప్రజలకు జీవనాధారమైన నాపరాళ్ల పర్రిశమను నాశనం చేసిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి ప్రజలను ఓటు అడిగే హక్కు ఎంత మాత్రం లేదని బనగానపల్లె టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దనరెడ్డి మండిపడ్డారు.

బీసీకి స్వాగతం పలుకుతున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు

నాపరాళ్ల పరిశ్రమను నాశనం చేసిన ఘనత ఆయనదే

మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దనరెడ్డి

కొలిమిగుండ్ల రూరల్‌, మే 4: కొలిమిగుండ్ల మండలంలో పేద, మధ్య తరగతి ప్రజలకు జీవనాధారమైన నాపరాళ్ల పర్రిశమను నాశనం చేసిన ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి ప్రజలను ఓటు అడిగే హక్కు ఎంత మాత్రం లేదని బనగానపల్లె టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దనరెడ్డి మండిపడ్డారు. శనివారం కొలిమిగుండ్ల మండలంలోని గొర్విమానుపల్లె, బందార్లపల్లె, పేట్నికోట, తుమ్మ లపెంట గ్రామాల్లో బీసీ జనార్దనరెడ్డి రోడ్‌షో నిర్వహించారు. అనంతరం జరిగిన సభల్లో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జడ్పీ చైర్మెన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. సంక్షేమ పథ కాల్లో సైతం అర్హులకు కోత విధించారని విమర్శించారు. చరిత్రలో ఎక్కడాలేని విధంగా రామ్‌కో సిమెంటు పరిశ్రమకు విక్రయించిన భూములకు రూ.38 కో ట్లు అదనపు పరిహారం ఇప్పించిన ఘనత తనదేనని గర్వంగా చెబుతా నన్నారు. విద్యుత్‌ చార్జీలు, ఆర్టీసీ చార్జీలు, నిత్యావసర ధరలతో పాటు మద్యం ధరలను ఇష్టానుసారంగా పెంచి, పేదల జీవితాలను చిన్నాభిన్నం చేశారని విమర్శించారు. అసైన్డ్‌ భూముల పంపిణీ పేరుతో డబ్బులు దోచుకు న్నారన్నారు. గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టని వైసీపీకి ఎందు కు ఓటు వేయాలని బీసీ ప్రశ్నించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నంద్యాల రామేశ్వరరెడ్డి, వీఅర్‌ లక్ష్మీరెడ్డి, ఉలువల నరసింహుడు, కళ్యాణ్‌రెడ్డి, అయా గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీడీపీలో చేరిక

బనగానపల్లె: కొలిమిగుండ్ల మండలం కోటపాడు, కోరుమానుపల్లెకు చెందిన వైసీపీ నాయకులు శనివారం బనగానపల్లె టీడీపీ కార్యాలయంలో పార్టీ అభ్యర్థి బీసీ జనార్దన్‌ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో కోటపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు ఓబులేసు, చిన్నయ్య, నరసింహులు, వెంకట నారాయణ, వెకంటరాముడు, గని, నవీన్‌, పక్కీరా, వెంకట సుబ్బయ్య, షేక్షావలి, అర్జున్‌, రాము, వెకంసటుబ్బయ్య తది తర 12 కుటుంబాలు చేరాయి. అలాగే కోరుమానుపల్లె గ్రామానికి చెందిన నాగప్ప, పక్కీర్‌బాషా, నాగేంద్ర, రాఘవలు టీడీపీలో చేరారు. వీరికి బీసీ జనార్దన్‌రెడ్డి టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Updated Date - May 04 , 2024 | 11:53 PM

Advertising
Advertising