ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

లోకేశ్‌ సమక్షంలో టీడీపీలో చేరిక

ABN, Publish Date - Apr 20 , 2024 | 12:16 AM

నంద్యాల మున్సిపాలిటీ 12వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్‌ ఖండే శ్యామసుందర్‌ లాల్‌, ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి బింగుమళ్ల శ్యామసుందర్‌ గుప్తా, యోగా గురూజీ ఆనంద్‌ కుమార్‌ శుక్రవారం సైకిలెక్కారు.

నారా లోకేశ్‌ సమక్షంలో టీడీపీలో చేరిన నాయకులు

నంద్యాల (నూనెపల్లె), ఏప్రిల్‌ 19: నంద్యాల మున్సిపాలిటీ 12వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్‌ ఖండే శ్యామసుందర్‌ లాల్‌, ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి బింగుమళ్ల శ్యామసుందర్‌ గుప్తా, యోగా గురూజీ ఆనంద్‌ కుమార్‌ శుక్రవారం సైకిలెక్కారు. కౌన్సిలర్‌తో పాటు ఆర్యవైశ్య, బలిజ సంఘం నాయకులు టీడీపీ నంద్యాల అభ్యర్థి న్‌ఎండీ ఫరూక్‌ తనయుడు ఖలీల్‌ అలియాస్‌ బబ్లూ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌, సీనియర్‌ నేత ఏవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సమక్షంలో టీడీపీలో చేరారు. అలాగే టీడీపలో చేరిన వారిలో వైసీపీ 20వ వార్డు ఇన్‌చార్జి కండిమల్ల వెంకట నరేష్‌ కుమార్‌, ఆర్యవైశ్య సంఘం నాయకులు తొమ్మండ్ల నాగరాజు, నంద్యాల డిస్ట్రిబ్యూటర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు శేగు శ్రీనివాసులు, జనరల్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ కోశాధికారి గెలివి శేఖర్‌, రైతు సంఘం నాయకులు చింతల కుమార్‌, బలిజ సంఘం నాయకులు ఉల్లి నాగేశ్‌, సంఘం నాయకులు కేశవకుమార్‌ చౌదరి, కేవీ బాబు, నంద వెంకటేశ్వర్లు, ఇల్లా రమణ యాదవ్‌, జనసేన నాయకులు నూకల కృష్ణ ఉన్నారు. ఆర్యవైశ్య, బలిజ సంఘం నాయకులు మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఆర్యవైశ్య, బలిజ సామాజిక వర్గాలను నిర్లక్ష్యం చేశారని, వచ్చే ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. టీడీపీ గెలుపు కోసం కృషి చేయాలని నారా లోకేశ్‌ సూచించారని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించినట్లు ఆర్యవైశ్య, బలిజ సంఘం నాయకులు తెలిపారు.

Updated Date - Apr 20 , 2024 | 12:16 AM

Advertising
Advertising