టీడీపీలో చేరిక
ABN, Publish Date - Apr 15 , 2024 | 01:01 AM
శ్రీశైలం మండలం తన కంచు కోటగా భావిస్తున్న శిల్పా చక్రపాణిరెడ్డికి మండల ప్రజలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు.
శ్రీశైలం, ఏప్రిల్ 14: శ్రీశైలం మండలం తన కంచు కోటగా భావిస్తున్న శిల్పా చక్రపాణిరెడ్డికి మండల ప్రజలు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. శ్రీశైలం దేవస్థానం పరిధిలో సుమారు 300 వందల కుటుంబాలకు పైగా వైసీపీని వీడి శ్రీశైలం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖరరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరాయి. ఆదివారం సుండి పెంటలో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వైసీపీకి చెందిన మాల మహానాడు నాయకులైన సామేలు, రాజు, సాలేముల ఆధ్వర్యంలో వైసీపి భూత్ కన్వినర్ రాజు, నాగేశ్వరరావు, చెన్నయ్య, చిన్నయ్య, షఫి, బంజార నాయకులైన భీములనాయక్, శినాయక్, శ్రీనునాయక్, బాలాజి నాయక్, సతీష్‌నాయక్‌తో కలిపి సుమారు 110 కుటుంబాలు టీడీపీలో చేరాయి. వీరికి బుడ్డా రాజశేఖరరెడ్డి కండువాలు కల్పి పార్టీలోనికి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ పాలనలో శిల్పా చక్రాణిరెడ్డి ఓటు బ్యాంకుగానే దళితులను, గిరిజనులను వాడుకున్నారే తప్ప, తమకు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదని
Updated Date - Apr 15 , 2024 | 01:01 AM