తెలంగాణ సీఎంకు ఆహ్వానం
ABN, Publish Date - Jul 31 , 2024 | 11:49 PM
మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఉత్సవాలు ఆగస్టు 18 నుంచి జరగనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆహ్వానించారు.
రాఘవేంద్రస్వామి ఉత్సవాల ఆహ్వాన పత్రిక అందజేత
రేవంత్ రెడ్డికి పీఠాధిపతి ఘన సన్మానం
మంత్రాలయం, జూలై 31: మంత్రాలయం రాఘవేంద్రస్వామి ఉత్సవాలు ఆగస్టు 18 నుంచి జరగనున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు ఆహ్వానించారు. బుధవారం హైదరాబాదులోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు, అసిస్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, సూపరింటెండెంట్ అనంతపురాణిక్ కలిసి సీఎం రేవంత్‌కు ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం సీఎంకు వెండి ప్లేటు, పట్టువస్త్రం, రాఘవేంద్రస్వామి మెమెంటో ఇచ్చి ఘనంగా సత్కరించారు.
Updated Date - Jul 31 , 2024 | 11:49 PM