ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

ABN, Publish Date - Apr 16 , 2024 | 12:35 AM

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్‌ సోమవారం సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు.

కర్నూలు, ఏప్రిల్‌ 15: ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్‌ సోమవారం సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. తాలుకా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలైన గార్గేయాపురం, పి.రుద్రవరం గ్రామాలను సందర్శించి అక్కడ భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను తనిఖీ చేశారు. పోలింగ్‌ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేపట్టాల్సిన భద్రత చర్యల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మే 13న జరిగే ఎన్నికల్లో ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ శ్రీనివాసరెడ్డి, తాలుకా ఎస్‌ఐ ఏసీ పీరయ్య, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు

Updated Date - Apr 16 , 2024 | 12:35 AM

Advertising
Advertising