జెండాకు వందనం
ABN, Publish Date - Aug 16 , 2024 | 12:57 AM
నంద్యాల పట్టణంలో 78వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు.
నంద్యాల (నూనెపల్లె), ఆగస్టు 15: నంద్యాల పట్టణంలో 78వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. టీడీపీ జిల్లా కార్యాలయ ఆవరణలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ జాతీయ జెండాను ఎగురవేశారు. మంత్రి ఫరూక్ కార్యాలయ ఆవరణలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్‌లు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా విద్యార్థి, రాజకీయ పార్టిల కార్యాలయాల్లో జెండా పండుగను ఘనంగా నిర్వహించారు.
పాణ్యం: మండలంలో తహసీల్దారు నరేంద్రనాథ రెడ్డి, ఎస్‌ఐ అశోక్, ఎంపీడీవో దస్తగిరి, ఎంఈవో కోటయ్య, ఏపీఎం ప్రసాద్ వారి కార్యాలయాల వద్ద, సీహెచ్‌సీ వద్ద డాక్టర్ ముని స్వామి జెండా ఎగురవేశారు. పాణ్యం గ్రామ పంచాయతీ కార్యాలయం పారిశుధ్య కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లను, విశ్రాంత సిపాయిలను పంచాయతీ కార్యదర్శి ఆనందరావు ఆధ్వర్యంలో సత్కరించారు. సర్పంచ్ పల్లవి, ఉపసర్పంచ్ చంద్రశేఖరరెడ్డి, ఎంపీపీ ఉశేన్‌బీ, ఈవోఆర్డీ సులోచన, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
గడివేముల: తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బీవీఎన్ విద్యాసాగర్, పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ బీటీ వెంకటసుబ్బయ్య, ఆదర్శ పాఠశాలలో టీడీపీ మండల అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఆదర్శ పాఠశాలలో పావురాళ్లను పైకి ఎగురవేశారు. గడివేముల మాజీ సర్పంచ్ జమాల్‌బాషా, డిప్యూటీ తహసీల్దార్ గురునాథం, ఏఎస్‌ఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
గోస్పాడు: గోస్పాడు పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పరదేశి ప్రమీల జెండా ఆవిష్కరించారు. తేళ్లపురి పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కాటంరెడ్డి సుదామణి, తహసీల్దారు కార్యాలయంలో తహశీల్దారు షేక్ మొహిద్దీన్ జెండా ఎగురవేశారు.
ఆత్మకూరు: ఆత్మకూరులోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు కంచర్ల గోవిందరెడ్డి, జెట్టి వేణుగోపాల్, కలీముల్లా, అబ్దులాపురం బాషా, రాష్ట్ర హజ్ కమిటీ మాజీ చైర్మన్ మోమిన్ అహ్మద్‌హుసేన్ కార్యాలయం వద్ద మోమిన్ అహ్మద్‌హుసేన్, బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గం కన్వీనర్ మోమిన్ షబాన, మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ మారూఫ్ ఆసియా, న్యాయస్థానంలో సీనియర్ సివిల్ న్యాయాధికారి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జెండాను ఎగురవేశారు. అలాగే ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో ఎం.దాసు, డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ ఆర్.రామాంజి నాయక్, అటవీ డివిజనల్ కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ వి.సాయిబాబా, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రత్నరాధిక, పోలీసు స్టేషన్‌లో సీఐ లక్ష్మీనారాయణ, ఎంపీడీవో కార్యాలయంలో వైస్ ఎంపీపీ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. వ్యవసాయశాఖ కార్యాలయంలో ఏడీ ఆంజనేయులు, ఎమ్మార్సీలో ఎంఈవో సురేష్, ఆర్టీసీ డిపోలో మేనేజర్ మహేంద్రుడు, సెబ్ కార్యాలయంలో సెబ్ సీఐ మారుతీకుమార్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ జిష్ణు నాగవిజయ్, అగ్నిమాపక కేంద్రంలో ఫైర్ ఆఫీసర్ భీముడునాయక్ ఆధ్వర్యంలో పతాకాన్ని ఆవిష్కరించారు. బంగారు దుకాణాల అసోషియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు ఏంఏ రషీద్, ఆర్టీసీ బస్టాండ్ ఎదుట సీఐటీయూ, ఆటో స్టాండ్ వద్ద ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ మువ్వన్నెల జెండాను ఎగురవేశారు.
ఆత్మకూరురూరల్: వెంకటాపురం గ్రామంలోని జడ్పీ హైస్కూల్‌లో సర్పంచ్ మహానంది గంగాదేవి ఆధ్వర్యంలో, బైర్లూటి పీహెచ్‌సీలో వైద్యాధికారులు పవన్‌కుమార్, గోపాల్ ఆధ్వర్యంలో, మండలంలోని బైర్లూటి గిరిజన ఆశ్రమ బాలికల ఆశ్రమ పాఠశాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మోమిన్‌షబానా, ప్రిన్సిపాల్ రేఖామణి ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు.
వెలుగోడు: తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాసగౌడ్, ఎమ్మార్సీ భవన్‌లో ఎంఈవో బ్రహ్మం నాయక్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ లాలం రమేష్, పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ భూపాలుడు, వెలుగు కార్యాల యంలో ఏపీఎం సుగుణపాల్, వెలుగోడు గ్రామ పంచాయతీలో సర్పంచ్ జయపాల్, టీడీపీ కార్యాలయంలో అన్నారపు శేషిరెడ్డి జెండాను ఎగుర వేశారు.
మహానంది: తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రమాదేవి, తిమ్మాపురంలోని ఎంపీడీవో కార్యాలయంలో శ్రీనివాసరెడ్డి, పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ ఓబులేసు, మహానంది దేవస్థానం కాలనీలో ఏఈవో మధు, గోపవరం సచివాలయంలో సర్పంచ్ సుదర్శనం, పంచాయతీ కార్యదర్శి కలువ భాస్కర్, మహానందిలోని ఎస్‌టీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో టీడీపీ నాయకులు సూరే శ్రీనివాసులు, గంగిశెట్టి మల్లికార్జునరావు, తిమ్మాపురంలోని పీహెచ్‌సీలో వైద్యాధికారి భగవాన్‌దాస్, ఎంపీహెచ్‌ఈవో ఉసేన్‌రెడ్డి, యి.బొల్ల వరంలో టీడీపీ నాయకుడు కిలార్ వెంకటేశ్వర్లు పతాకావిష్కరణ చేశారు
బండిఆత్మకూరు: తహసీల్దార్ ఆల్‌ఫ్రెడ్, మోడల్ స్కూల్ ఎస్‌ఎంసీ చైర్మన్ రమేష్‌యాదవ్, ఎంపీపీ దేరెడ్డి చిన్నసంజీవరెడ్డి, సహకార సంఘం సీఈవో గోపాల్ జెండా ఎగురవేశారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ, ఎండీవో వాసుదేవ గుప్తా, ఏపీవో వసుధ, ఏవో హానీఫ్‌ఖాన్ మొక్కలు నాటారు.
నందికొట్కూరు: పంద్రాగస్టు వేడుకలు అంటే ప్రతి ఒక్కరికి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అన్నారు. నందికొట్కూరు పట్టణంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిగాయి. పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల వద్ద మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. పట్టణంలోని మార్కెట్ యార్డులోనూ, తహసీల్దార్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, ఎమ్మెల్యే కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, వ్యవసాయశాఖ ఏడీఏ కార్యాలయం, ఎక్సైజ్ శాఖ, హెచ్‌ఎన్.ఎస్.ఎస్. కార్యాలయం, పోలీస్టేషన్, కోర్టు ఆవరణ, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మార్కెట్ యార్డులో జెండాను ఎగురవేయడం చాలా గర్వంగా ఉండడంతో పాటు... తన జీవితంలో మరిచిపోలేని గౌరవం తనకు దక్కిందని ఎమ్మెల్యే జయసూర్య అన్నారు. ఎందరో త్యాగాల ఫలితంగానే నేడు స్వేచ్చావాయువులను పీల్చుకుంటున్నామన్నారు. టీడీపీ నాయకులు భాస్కర్‌రెడ్డి, మీనాక్షిదేవి, డా.వనజ, నిమ్మకాయల రాజు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్‌రెడ్డి జెండాను ఆవిష్కరించారు. మున్సిపల్ కమిషనర్ సుధాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు. పట్టణంలోని ఎస్‌ఎస్ ఆర్ నగర్‌లోని ఎంపీపీ స్కూల్‌లో మాజీ కౌన్సిలర్ టౌన్ క్లస్టర్ ఇన్‌చార్జి ముర్తుజావళి పాల్గొని జెండాను ఆవిష్కరించారు. పాఠశాలలోని 150 మంది విద్యార్థులకు టిఫిన్ బాక్సులు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. అలాగే స్కూల్‌కు మైక్ సెట్ కోసం రూ.10 వేలు ఆర్థిక సాయం చేశారు. దారుల్-ఉలుమ్-ఐ-నుల్-హుదా మదరసాలో టీడీపీ సీనియర్ నాయకుడు ఆల్-హజ్-హాజీ మహబూబ్ సాహెబ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. కరస్పాండెంట్ అబ్దుల్ రెహమాన్, వజీర్ బాషా పాల్గొన్నారు.
స్వాతంత్య్ర సంగ్రామంలో ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితమే నేడు మనం స్వేచ్ఛా వాయువును పీల్చుతున్నామని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాకరవాడ చిన్న వెంకటస్వామి అన్నారు. పట్టణంలోని బైరెడ్డి కాంప్లెక్స్‌లోని టీడీపీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. టీడీపీ నాయకులు నాగేశ్వరరావు, అబ్దుల్ సుకూర్, సాహెబ్‌ఖాన్, మురళీధర్‌రెడ్డి, బంగారు వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
నందికొట్కూరు రూరల్: నందికొట్కూరు మండలంలోని ఎంపీడీవో, తహసీల్దార్, అగ్రికల్చర్, ఎంఈవో కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో ్ల జెండా ఎగురువేశారు. కార్యక్రమాల్లో ఎంపీడీవో శోభారాణి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఏడీఏ విజయ శేఖర్ పాల్గొన్నారు.
పాములపాడు: పాములపాడులోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సుభద్రమ్మ, పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ సురేశ్‌కుమార్, కేజీబీవీలో ప్రిన్సిపాల్ రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించారు.
పగిడ్యాల: తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శివరాముడు, ఎంపీడీవో కార్యాలయంలో జడ్పీటీసీ పుల్యాల దివ్య, ఎంపీడీవో వెంకటరమణ, ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ గంగయ్య జెండాను ఆవిష్కరించారు.
నెహ్రూనగర్ జడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి పరీక్షల్లో 552 మార్కులు సాధించిన కె.రాఘవికి పాలూరు వెంకటేశ్వర్లు రూ.25 వేలు, కట్టుబడి శ్రీనివాసులునాయుడు రూ.5 వేలు, 550 మార్కులు సాధించిన విజయపాలినికి ఎం.మధుకుమార్ రూ.15 వేలు అందించారు. సర్పంచ్ రాజేశ్వరి పాల్గొన్నారు.
మిడుతూరు: మిడుతూరు తహసీల్దార్ కార్యాలయంలంలో తహసీల్దార్ శ్రీనివాసులు, పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ జగన్‌మోహన్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మల్లు వెంకటేశ్వరమ్మ, సచివాలయంలో సర్పంచ్ జయలక్షమ్మ, వ్యవసాయ కార్యాలయంలో టీడీపీ మండల కన్వీనర్ కాతా రమేష్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు. మిడుతూరు జడ్పీ హైస్కూల్‌లో సురబి సబద్రమ్మ మల్లికార్ణునశెట్టి జ్ఞాపకార్థం విద్యార్థులకు పెన్నులు, మిఠాయిలు పంచారు.
జూపాడుబంగ్లా: తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ చంద్రశేఖర్‌నాయక్, ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీపీ సువర్ణమ్మ, ఎంపీడీవో నూర్జహాన్, పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐ లక్ష్మీ నారాయణ, సహకార సొసైటీ వద్ద వెంకటరమణ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించారు.
కొత్తపల్లి: తహసీల్దార్ కార్యాలయంలో తహసీ ల్దార్ ఉమారాణి, పోలీస్ స్టేషన్‌లో ఏఎస్‌ఐ బాబా ఫకృద్దీన్, ఎంపీడీవో కార్యాల యంలో ఎంపీపీ కుసుమలత, ఎంపీడీవో మేరి, జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి, ఎమ్మార్సీ భవన్‌లో ఎంఈవో-2 ఇనయతుల్లా జాతీయ జెండాలను ఎగురవేశారు. అలాగే ఎర్రమటం, గోకవరం, కొత్తపల్లి పీహెచ్‌సీ లలో వైద్యాధి కారులు జబీర్, జుబేదా, దీపా నాగవేణి, దుద్యాల పశు వైద్యశాలలో పశువైద్యాధికారి అశోక్‌కుమార్ జెండాను ఎగురవేశారు. వ్యవసాయ కార్యాల యంలో ఏవో మహేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
Updated Date - Aug 16 , 2024 | 12:57 AM