పెరుగుతున్న అతిసార కేసులు
ABN, Publish Date - Jul 01 , 2024 | 11:50 PM
మండలంలోని మిట్టకందాల గ్రామంలో రోజురోజుకు అతిసార కేసులు పెరుగుతున్నాయి.
పాములపాడు, జూలై 1: మండలంలోని మిట్టకందాల గ్రామంలో రోజురోజుకు అతిసార కేసులు పెరుగుతున్నాయి. జూన్ 18న రెండు అతిసార కేసులు నమోదయ్యాయి. దీంతో మండల వైద్యాధికారి పర్యవేక్షణలో గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. అయినా గతనెల 29న నాలుగు, 30న 9 కేసులు, సోమవారం 5 కేసులు నమోదు అయ్యాయని వైద్యాధికారి తెలిపారు గ్రామాన్ని సోమవారం ర్యాపిడ్ రెస్పాన్స్ బృందం సందర్శించింది. ముగ్గురు మిట్టకందాల, ఇద్దరు ఆత్మకూరు, ఒకరు కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీం అసిస్టెంట్ డాక్టర్ మహీంద్రనాద్ కుమార్, సుషరత్, సచిన్‌కుమార్, జాహ్యవిలు గ్రామంలో సందర్శించి ప్రజలకు అవగాహన కల్పించారు.
Updated Date - Jul 01 , 2024 | 11:50 PM