ఆసుపత్రి తనిఖీ
ABN, Publish Date - Jul 23 , 2024 | 11:59 PM
మండలంలోని గాజులపల్లి గ్రామంలో మంగళవారం డీపీవో మంజులావాణి పర్యటించారు.
మహానంది, జూలై 23: మండలంలోని గాజులపల్లి గ్రామంలో మంగళవారం డీపీవో మంజులావాణి పర్యటించారు. గ్రామంలోని ప్రభుత్వ ఆసుపత్రి, జడ్పీ పాఠశాలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం పారిశుధ్యంపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ప్రస్తుతం వర్షాకాలంలో కావడంతో గ్రామాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా మండల స్ధాయి అధికారులు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి, ఈవోఆర్డీ శివనాగజ్యోతి, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ పవన్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి ఇర్ఫాన్, వెల్ఫేర్ అసిస్టెంట్ లింగమయ్య, ఇంజనీరింగ్ అసిస్టెంట్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Updated Date - Jul 23 , 2024 | 11:59 PM