ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
ABN, Publish Date - Aug 30 , 2024 | 01:12 AM
చాగలమర్రి గ్రామంలోని బాలుర ఉన్నత పాఠశాల, వాసవీ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో తెలుగు భాషా, జాతీయ క్రీడా దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు.
చాగలమర్రి, ఆగస్టు 29: చాగలమర్రి గ్రామంలోని బాలుర ఉన్నత పాఠశాల, వాసవీ ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలో తెలుగు భాషా, జాతీయ క్రీడా దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల కమిటీ చైర్మన గౌస్‌మోహిద్దీన, హెచఎం కోటయ్య, గిడుగు రామమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్సర్‌బాషా, ప్రిన్సిపాల్ శ్యాబుద్దీన, ఎనఎస్‌ఎస్ అధికారి మహేశ్వరయ్య, టీడీపీ నాయకులు షమిద్దీన, అజిముద్దీన, మౌలాలి, నాగరాజు పాల్గొన్నారు.
రుద్రవరం: కేజీబీవీ, గురుకుల విద్యాలయం, ఆదర్శ పాఠశాల ఉన్నత పాఠశాలల్లో తెలుగుభాషా దినోత్సవం, క్రీడాదినోత్సవం నిర్వహించారు. భాషా ఉద్యమానికి కృషి చేసిన గిడుగు వెంకటరామమూర్తి, హాకీ క్రీడాకా రుడు ధ్యానచంద్ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. తెలుగు ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమాల్లో కేజీబీవీ ప్రిన్సిపాల్ లక్ష్మీదేవి, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ నాగేశ్వర్‌రావు, హెచఎం సుబ్బరా యుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఉయ్యావాలవాడ: తెలుగు భాష అమ్మవంటిదని, అలాంటి భాషను మరువకూడదని ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివా సరెడ్డి తెలిపారు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గురువారం గిడుగు రామ్మూర్తి పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అలాగే క్రీడా దినోత్సవం సందర్భంగా ధ్యానచంద్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వైస్ ప్రిన్సిపాల్ ఇఫ్తీకర్, ఉపాధ్యాయులు ముర ళీకృష్ణ, దివాకర్, ప్రభాకర్, షోని, హిమబిందు తదితరులు పాల్గొన్నారు.
ఆళ్లగడ్డ: మండలంలోని కోటకందుకూరు ఏపీ మోడల్ పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రిన్సిపాల్ రాజు, ఉపాధ్యా యులు పాల్గొన్నారు.
డోన(రూరల్): పట్టణంలోని పాతపేట జడ్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగుభాషా, జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి ప్రభాకర్ హాజరై మాట్లాడారు. చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుం దన్నారు. అనం తరం ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమంలో ప్రధానో పాధ్యాయు రాలు పద్మావతమ్మ, సీనియర్ ఉపాధ్యాయుడు వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు.
బేతంచెర్ల: గిడుగు వెంకట రామ్మూర్తి జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవాన్ని మోడల్ స్కూల్‌లో ఇనచార్జి ప్రిన్సిపాల్ నాగ రాజు ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅ తిథిగా పేరెంట్స్ కమిటీ చైర్మన సండ్రబోయిన బాలకృష్ణ హాజరై మాట్లాడారు. తెలుగు భాషకు కృషి చేసిన కవుల కళాకారుల రచయితల ఛాయా చిత్రాలను విద్యార్థులు ప్రదర్శించారు. ఇనచార్జి ప్రిన్సిపాల్, తెలుగు ఉపాధ్యా యుడు గంగుల నాగరాజు పాల్గొన్నారు.
కొలిమిగుండ్ల: అమ్మలాంటి కమ్మనైనది తెలుగు భాష అని మండల విధ్యాధికారులు అబ్దుల్‌కలాం, రాజయ్య కొనియాడారు. గురువారం మండ లంలోని పేట్నికోట జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు భాషా, జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యా యులు రమణయ్య, గురప్ప, వ్యాయమ ఉపాధ్యాయిని గంగాదేవిలను సన్మానించారు. కార్యక్రమంలో వైవీఎస్ నారాయణరెడ్డి, సుధాకర గుప్త, భాస్కరరెడ్డి, వెంకటేష్‌నాయక్, మద్దిలేటి, మోహన పాల్గొన్నారు.
కోవెలకుంట్ల: పట్టణంలోని జడ్పీ ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఏపీ ఉపాధ్యాయ సంఘం కోవెలకుంట్ల మండల శాఖ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా, తెలుగుభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిఽథు లుగా ఎంఈవోలు వెంకటరామిరెడ్డి, వెంకటసుబ్బయ్య, రాజయ్య హాజ ర య్యారు. ముందుగా ధ్యానచంద్, గిడుగురామ్మూర్తి చిత్రపటాలకు పూలమా లలు వేసి నివాళి అర్పించారు. అనంతరం తెలుగు ఉపాధ్యాయులను సన్మానించారు. ప్రధానోపాధ్యాయులు ఫారుక్, అబ్బాస్ పాల్గొన్నారు.
ప్యాపిలి: పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ సుబ్ర హ్మణ్యం, అధ్యాపకులు నవీనపాటి తదితరులు పాల్గొన్నారు.
సంజామల: మండలంలోని వివిధ పాఠశాలల్లో గురువారం జాతీయ క్రీడా దినోత్సవంతోపాటు తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. సంజామల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కాణాల జిల్లా ఉన్నత పాఠ శాలలో విద్యార్థులకు ఆటల పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజే తలకు బహుమతులను ప్రదానం చేశారు. హెచఎం అరుణ కుమారి, ఇన చార్జి హెచఎం శ్రీనివాసులు వారి సేవలను కొనియాడారు.
Updated Date - Aug 30 , 2024 | 01:12 AM