ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రామసభలతో స్వర్ణయుగం

ABN, Publish Date - Aug 24 , 2024 | 01:32 AM

గ్రామ పంచాయతీలను సుస్థిరంగా అభివృద్ధి చేసి స్వర్ణయుగం స్థాపించేందుకే గ్రామ సభలు నిర్వహిస్తున్నామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు.

నన్నూరు గ్రామ సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌరు చరిత

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత

ఓర్వకల్లు, ఆగస్టు 23: గ్రామ పంచాయతీలను సుస్థిరంగా అభివృద్ధి చేసి స్వర్ణయుగం స్థాపించేందుకే గ్రామ సభలు నిర్వహిస్తున్నామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. శుక్రవారం మండలంలోని నన్నూరు గ్రామ సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గౌరు చరిత హాజరయ్యారు. ఆ సభకు గ్రామ సర్పంచ బ్రహ్మయ్య అధ్యక్షత వహించారు. హుశేనాపురం గ్రామ సభకు సర్పంచ చంద్ర గోవర్దనమ్మ అధ్యక్షత వహించగా.. ముఖ్య అతిథిగా నంద్యాల టీడీపీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ హాజరయ్యారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అద్భుతమైన నిర్ణయం తీసుకుని దేశంలో ఎన్నడూ లేనివిధంగా 13,326 గ్రామ పంచాయతీలలో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహిస్తున్నదని అన్నారు. గ్రామ సభల్లో తీర్మానాలు అమలు చేయడం వల్ల గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. కార్య క్రమంలో ఎంపీపీ తిప్పన్న, డీఎల్‌డీవో బాలకృష్ణ, ఎంపీడీవో శివనాగప్రసాద్‌, తహసీల్దార్‌ వెంకటరమణ, విశ్వేశ్వరరెడ్డి, విజయుడు, ఖాజామియా, ఆయా శాఖ అధికారులు పాల్గొన్నారు.

కల్లూరు: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం టీడీపీ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గ్రామంలో చేపట్టాల్సిన ఉపాధి హామీ పనుల గుర్తింపు కోసం శుక్రవారం కల్లూరు మండలం ఉలిందకొండ గ్రామంలో స్పెషల్‌ ఆఫీ సర్‌ రమణ, ఎంపీడీఓ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ సభకు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన జగనరెడ్డి సర్పంచులను ఉత్సవ విగ్రహా ల్లా మార్చారన్నారు. గ్రామాల్లో వీధిలైట్లు, డ్రైనేజీ, రోడ్లు, త్రాగునీటి సరఫ రాకు సర్పంచులు అప్పులు చేశారని తెలిపారు. గ్రామసభలో రూ.3కోట్లతో మొత్తం 20 పనులు గుర్తించామన్నారు. తక్షణమే రూ.40 లక్షలు విడుదల చేసినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఈఓఆర్డీ రవికిషోర్‌, ఏపీఓ మద్దీశ్వ రమ్మ, ఉలిందకొండ టీడీపీ సీనియర్‌ నాయకుడు ఈవీరమణ, రంగస్వా మిరెడ్డి, యుద్ధం శ్రీనివా సులు, సుబ్బరాయుడు, మురళి, వెంకటేశ్వర్లు, దస్తగిరినాయుడు, ఈవీశ్రీకాంత, విక్రమ్‌, సీవీ రమణ, మహేంద్ర, షేక్షావలి, కరీం తదితరులు పాల్గొన్నారు.

గూడూరు: గ్రామాల అభివృద్ధికే ప్రభుత్వం ప్రత్యేక గ్రామసభలు నిర్వహి స్తోందని ఎంపీడీవో విజయసింహరెడ్డి అన్నారు. శుక్రవారం గూడూరు మండలం గుడిపాడు గ్రామంలో 2024-25లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టె పనులకు సంబంధించి గ్రామ సభను నిర్వహిం చారు. ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామానికి అవసరమైన సీసీరోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు, పాఠ శాల ప్రహరీ, ఇతర అభివృద్ది పనులు చేపటేందుకే గ్రామ సభను నిర్వహిం చామన్నారు. స్పెషల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సునిల్‌ కన్నా, టీడీపీ నాయకుడు మహేశ్వర రెడ్డి, సర్పంచ, ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.

కోడుమూరు: స్థానిక పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టాల్సిన పనులను నిమిత్తం సర్పంచు భాగ్యరత్న ఆధ్వర్యంలో గ్రామ సభను చేపట్టారు. రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు హాజరై పలు ప్రాంతాలల్లో పనులు చేపట్టా లని వినతి పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్‌, పంచాయతీ కార్యదర్శి అజయ్‌భాస్కర్‌, మాజీ సర్పంచు సీబీ లత, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు కేఈ మల్లికార్జునగౌడ్‌, మండల కన్వీనర్‌ కోట్ల కవితమ్మ, టీఎన్‌టీయూసీ తాలుకా అధ్యక్షులు గోపాల్‌నాయుడు, బడెసాగౌడ్‌, రాముడు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 01:32 AM

Advertising
Advertising
<