ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అక్రమ నిర్మాణం కూల్చివేత

ABN, Publish Date - Aug 21 , 2024 | 12:46 AM

అవుకు మండలం శివవరం గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని నిర్మించిన ఇంటిని రెవెన్యూ, పోలీస్‌ అధికారులు మంగళవారం కూల్చివేశారు.

కూల్చివేతకు గురైన ఇల్లు

అవుకు, ఆగస్టు 20: అవుకు మండలం శివవరం గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని నిర్మించిన ఇంటిని రెవెన్యూ, పోలీస్‌ అధికారులు మంగళవారం కూల్చివేశారు. ఈ విషయంలో శివవరం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు వ్యాపర్ల చిన్న సుబ్బారెడ్డి, గుత్తి లలితమ్మ కటకటాల పా లయ్యారు. ఉదయం బనగానపల్లె సీఐ మంజునాథరెడ్డి, తహసీల్దార్‌ మల్లి కార్జునరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ ప్రసాద్‌బాబు, అవుకు, నందివర్గం ఎస్‌ఐలు రాజారెడ్డి, బీటీ వెంకటసుబ్బయ్య పోలీస్‌ సిబ్బందితో శివవరం గ్రామానికి చేరుకొని ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన ఇంటిని ఎక్సకవేటర్‌తో కూలగొట్టారు. శివవరం గ్రామానికి చెందిన చిన్న సుబ్బారెడ్డి 2023 మే 16న గతంలో తహసీల్దార్‌గా పనిచేసిన ప్రసాద్‌బాబు సంతకాన్ని ఫోర్జరీ చేశాడు. తన ఇంట్లో పని మనిషి గుత్తి లలితమ్మ పేరుతో నకిలీ ఇంటి పట్టా సృష్టించి ఎస్సీ కాలనీలోని మహిళల సామూహిక మరుగుదొడ్డిని కూల్చి ఏకంగా ఇం టిని నిర్మించాడు. ఈ ఏడాది జూన నెల 21వతేదీన ఎస్సీ కాలనీకి చెందిన మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి నిర్మాణం జరుగుతున్న ఇంటి వద్ద నీళ్ల చెంబులతో నిరసనకు దిగారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరువ ర్గాల మహిళలను విచారణ నిమిత్తం పోలీస్‌ స్టేషనకు తరలించారు. తహసీ ల్దార్‌ ప్రసాద్‌బాబు తన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు లిఖిత పూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ అనంతరం పోలీసులు వ్యాపర్ల చిన్న సుబ్బారెడ్డి, గుత్తి లలితమ్మపై కేసు నమోదు చేసి ఈనెల 17న ఇరువురిని రిమాండ్‌కు తరలించారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - Aug 21 , 2024 | 12:46 AM

Advertising
Advertising
<