భూసారం ఆధారంగా సాగు చేపట్టాలి: డీఏవో
ABN, Publish Date - Oct 24 , 2024 | 12:52 AM
రైతులు తమ పొలాల్లో భూసారం ఆధారంగా పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ సూచించారు.
ఎర్రగుంట్లలో మొక్కజొన్న పంటను పరిశీలిస్తున్న డీఏవో
బండిఆత్మకూరు, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): రైతులు తమ పొలాల్లో భూసారం ఆధారంగా పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారిమురళీకృష్ణ సూచించారు. బుధవారం ఎర్రగుంట్ల గ్రామంలో జరిగిన పొలం పిలుస్తోంది కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. గ్రామంలో పొగాకు, మొక్కజొన్న పంటలను పరిశీలిం చారు. అనవసరంగా ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడొద్దని, ఖర్చులు తగ్గించాలని కోరారు. ఏడీఏ రాజశేఖర్, రైతులు పాల్గొన్నారు.
Updated Date - Oct 24 , 2024 | 12:54 AM