ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘ఉపాధ్యాయులపై కేసులు ఎత్తివేయాలి’

ABN, Publish Date - Jun 17 , 2024 | 11:57 PM

ఉపాధ్యాయులపై గత ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించి వారిపై నమోదు చేసిన బైండోవర్‌ కేసులను, సస్పెన్షన్‌ లను, చార్జి మెమోలను టీడీపీ ప్రభుత్వం ఎత్తి వేయాలని ఎస్టీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుధాకర్‌, కుమార్‌ కోరారు.

నంద్యాల (నూనెపల్లె), జూన్‌ 17: ఉపాధ్యాయులపై గత ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించి వారిపై నమోదు చేసిన బైండోవర్‌ కేసులను, సస్పెన్షన్‌ లను, చార్జి మెమోలను టీడీపీ ప్రభుత్వం ఎత్తి వేయాలని ఎస్టీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుధాకర్‌, కుమార్‌ కోరారు. సోమవారం నంద్యాలలోని జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. 2022లో పదో తరగతి పరీక్షల సందర్భంగా ఉపాధ్యాయులపై నమోదు చేసిన బైండోవర్‌ కేసులను ఎత్తి వేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే అనారోగ్య కారణాలతో ఎన్నికల విధులకు హాజరు కాని ఉపాధ్యాయులపై ఉన్న సస్పెన్షన్లను, చార్జి మెమోలను మానవతా దృక్పథంలో నూతన ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ.. ప్రాథమిక పాఠశాలలను నిర్వీర్యం చేసిన 117 జీవోను రద్దు చేసి ఉన్నత పాఠశాలలో విలీనమైన 3,4,5 తరగతులను తిరిగి ప్రాథమిక పాఠశాలల్లో కలపాలన్నారు. కార్యక్రమంలో ధరణి, కుపేంద్ర, రామకృష్ణ, రాము తదిరతులు పాల్గొన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 11:57 PM

Advertising
Advertising