ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అంధ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు: కలెక్టర్‌

ABN, Publish Date - Apr 16 , 2024 | 01:01 AM

కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన అంధుల డిజిటల్‌ లైబ్రరీ అంధ విద్యా ర్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్‌ జి.సృజన అన్నారు.

కర్నూలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 15: కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన అంధుల డిజిటల్‌ లైబ్రరీ అంధ విద్యా ర్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కలెక్టర్‌ జి.సృజన అన్నారు. సోమవారం బీ.క్యాంపు క్వార్టర్స్‌ విజ్ఞాన్‌ మందిర్‌ సమీపంలో ఉన్న జాతీయ అంధుల సమాఖ్య స్కిల్‌ డెవలప్మెంట్‌ సెంట రులో అంధుల డిజిటల్‌ లైబ్రరీని కలె క్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా అందరికీ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకుని రావడం ముఖ్యమన్నారు. దృష్టిలోపం ఉన్న వారికి చదువుకునే పుస్తకాల నుంచి పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు అందించాలనే ఉద్దేశంతో డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో సీపీవో హిమ ప్రభాకర్‌ రాజు, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ రంగలక్ష్మీదేవి, సీపీవో కార్యాలయం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ భారతి, జాతీయ అంధుల సమాఖ్య కర్నూలు శాఖ అధ్యక్షుడు పుష్పరాజ్‌, ప్రధాన కార్యదర్శి అనిల్‌ కుమార్‌, సభ్యులు రాఘ వయ్య, విశ్వనాథ్‌ రెడ్డి, కిబో పరికరం శిక్షకుడు తనూజ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 01:01 AM

Advertising
Advertising