ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అట్టహాసంగా కోట్ల నామినేషన్‌

ABN, Publish Date - Apr 25 , 2024 | 12:52 AM

డోన్‌ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా టీడీపీ తరపున కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి బుధవారం అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు.

కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్‌కు వెళ్తున్న కోట్ల

వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు

డోన్‌, ఏప్రిల్‌ 24: డోన్‌ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా టీడీపీ తరపున కోట్ల జయసూర్యప్రకాష్‌ రెడ్డి బుధవారం అట్టహాసంగా నామినేషన్‌ దాఖలు చేశారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో కోట్ల నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. అంతకుముందు కోట్ల తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సర్వమత ప్రార్థనలు నిర్వహించి ఆశీర్వచనాలు తీసుకున్నారు. అనంతరం స్థానిక టీడీపీ కార్యాలయం నుంచి మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, కోట్ల రాఘవేంద్రరెడ్డి, నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శభరి, కోట్ల నివేదిత, కోట్ల చిత్రమ్మ, మాజీ జడ్పీటీసీ కేఈ జయన్న, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ధర్మవరం సుబ్బారెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు వై.నాగేశ్వరరావు యాదవ్‌ తదితరులు నామినేషన్‌ కార్యక్రమానికి హాజర య్యారు. వేలాదిమంది కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి మాట్లాడుతూ డోన్‌ నియోజకవర్గ ప్రాంతం కరువు ప్రాంతమని, రైతులకు చెరువులకు సాగునీరు నింపి రైతుల జీవితాలు మారు స్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వలసల రామక్రిష్ణ, కోట్రికే ఫణిరాజ్‌, డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ లక్ష్మీరెడ్డి, మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ టీఈ కేశన్నగౌడు, మాజీ సర్పంచ్‌ కేశవయ్యగౌడు, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మురళికృష్ణగౌడు, మాజీ ఎంపీ శేషఫణిగౌడు, ఓబులాపురం శేషిరెడ్డి, మర్రిరమణ, కోట్ల గిరిధర్‌ రెడ్డి, శ్రీనివాసభట్‌, ధర్మవరం భరత్‌ రెడ్డి, టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి విజయభట్టు, నాయకులు తిమ్మయ్య, శ్రీనివాసులు యాదవ్‌, భాస్కర్‌ నాయుడు, సుధీష్‌, ఎల్లనాగయ్య, ఓంప్రకాష్‌, రంజిత్‌ కిరణ్‌, పరమేష్‌, రమేష్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి, శివ, చక్రపాణి, వలసల బాలుడు, అన్వర్‌భాషా, ఎస్‌ఎండీ రఫీ, బీజేపీ నాయకులు వడ్డె మహారాజ్‌, జనసేన నాయకులు ఆలా మోహన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 12:52 AM

Advertising
Advertising