తమ్ముడిని చంపిన అన్న అరెస్టు
ABN, Publish Date - May 26 , 2024 | 12:09 AM
మండలంలోని అనుగొండలో గత బుధవారం అర్ధరాత్రి తమ్ముడిని చంపిన అన్నను పోలీసులు అరెస్టు చేశారు
కోడుమూరు(రూరల్), మే 25:మండలంలోని అనుగొండలో గత బుధవారం అర్ధరాత్రి తమ్ముడిని చంపిన అన్నను పోలీసులు అరెస్టు చేశారు. సీఐ మన్సూరుద్ధీన్ వివరాల మేరకు.. అనుగొండ గ్రామంలో ఆస్తి తగాదాలతో అన్న భాస్కర్ తన సొంత తమ్ముడు వెంకటరాముడిపై వ్యవసాయ పనిముట్టు ఇనుప మేడితోకతో దాడి చేశాడన్నారు. దీంతో వెంకటరాముడు మృతి చెందాడని తెలిపారు. తమకు అందిన సమాచారం మేరకు పరారీలో ఉన్న నిందితుడు భాస్కర్‌ను శనివారం విశ్వభారతి ఆసుపత్రి సమీపంలో ఓ డాబా వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి ఇనుప మేడితోకను స్వాధీనం చేసుకుని రిమాండ్ తరలించినట్లు వివరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ బాలనరసింహులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - May 26 , 2024 | 12:09 AM