ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హత్య కేసులో నిందితుల అరెస్టు

ABN, Publish Date - Jul 08 , 2024 | 11:39 PM

మండలంలోని మద్దూరులో జరిగిన దూదేకుల పెద్ద దస్తగిరి హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు పాణ్యం సీఐ నల్లప్ప తెలిపారు.

పాణ్యం, జూలై 8: మండలంలోని మద్దూరులో జరిగిన దూదేకుల పెద్ద దస్తగిరి హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు పాణ్యం సీఐ నల్లప్ప తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఈనెల 2వ తేదీన మద్దూరు గ్రామానికి చెందిన దూదేకుల పెద్ద దస్తగిరిని అదే గ్రామానికి చెందిన వడ్డె రామాంజనేయులు అలియాస్‌ అంజి, నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన గోగుల హరి, నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన పుట్ట శ్రీనివాసులు, పెద్ద కొట్టాలకు చెందిన పుచ్చకాయల రవితేజలు కారులో వచ్చి మద్దూరులోని బీసీ కాలనీలో పాత కక్షలను దృష్టిలో ఉంచుకొని గొడ్డలి, కత్తి, కట్టెలతో దాడి చేసి చంపినట్లు తెలిపారు. పెద్ద దస్తగిరి కొడుకు దూదేకుల మదన్‌ షావలి అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో గిట్టని నిందితులు హత్య చేసినట్లు తెలిపారు. మృతుని కుమారుడు మదన్‌షావలి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సోమవారం మద్దూరు జడ్పీ హైస్కూలు సమీపంలో నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి కారు, గొడ్డలి, కత్తి, రెండు కట్టెలు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది నాగార్జున, వెంకటేశ్వర్లు, మన్సూర్‌ పాల్గొన్నారు

Updated Date - Jul 08 , 2024 | 11:39 PM

Advertising
Advertising
<