ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వచ్చే నెలలో అరాచక పాలన అంతం

ABN, Publish Date - Apr 26 , 2024 | 11:26 PM

వచ్చే నెల 13వ తేదీతో అరాచక పాలన అంతం కావడం ఖాయమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు.

రాష్ట్రాన్ని నాశనం చేసిన సీఎం జగన్‌

టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి

కర్నూలు(అర్బన్‌), ఏప్రిల్‌ 26: వచ్చే నెల 13వ తేదీతో అరాచక పాలన అంతం కావడం ఖాయమని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎంపీ డాక్టర్‌ సంజీవకుమార్‌, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జనసేన ఉమ్మడి జిల్లా ఆధ్యక్షుడు సురేష్‌లు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ ఒక్క చాన్స్‌ పేరుతో అధికారం చేపట్టిన జగన్‌ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లోనూ వెనుకబడడంతోపాటు బడుగు, బలహీన వర్గాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణచివేతకు గురయ్యాయని తెలిపారు. ఒక్కసారి నమ్మి వైసీపీకి ఓటు వేస్తే అభివృద్ధిలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కుపోయిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో పీఆర్సీ, డీఏ అమలు, సీపీఎస్‌ రద్దు చేస్తానని ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన జగన్‌రెడ్డి ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతాడని నిలదీశారు. ఎంపీ సంజీవకుమార్‌ మాట్లాడుతూ వైసీపీ పాలనలో సామాజిక న్యాయం జరగలేదన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సొంత చిన్నాన్నను చంపిన హంతకుడిని వెంటేసుకుని ప్రచారం చేయడం సిగ్గుగా అనిపించడం లేదా అని మండిపడ్డారు. తల్లి, చెల్లి, పిన్నమ్మకు న్యాయం చేయలేని దద్దమ్మ జగన్‌రెడ్డికి పాలించే అర్హత లేదన్నారు. సమావేశంలో మహిళా నాయకురాలు ముంతాజ్‌ బేగం, సత్రం రామకృష్ణుడు, జేమ్స్‌, ఆకెపోగు ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:26 PM

Advertising
Advertising