శ్రీశైలానికి 71,331 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
ABN, Publish Date - Aug 26 , 2024 | 11:45 PM
శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది.
శ్రీశైలం, ఆగస్టు 26: శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. మంగళవారం జూరాల నుంచి 1,30,001 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 2280 క్యూసెక్కులు మొత్తం 1,32,281 క్యూసెక్కు ల వరద ప్రవాహం వస్తోంది. సోమవారం సాయంత్రం 6 గంటల సమయానికి జలాశయానికి 71,331 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 884 అడుగులుగా నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 210.0320 టీఎంసీలుగా నమోదైంది. ఆంధ్రప్రదేశ్ జలవిద్యుత్ కేంద్రం ద్వారా 28,169 క్యూసెక్కులు, తెలంగాణ జల విద్యుత్ కేంద్రం ద్వారా 37,882 క్యూసెక్కులు మొత్తం 66,051 క్యూసెక్కుల నీటితో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువ నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు.
Updated Date - Aug 26 , 2024 | 11:45 PM