ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు రక్షణ కరువు

ABN, Publish Date - Apr 16 , 2024 | 01:04 AM

టీడీపీ హయంలో ప్రవేశ పెట్టిన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను తగ్గించడం తోపాటే ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టికక్షపూరితంగా వ్యవహరిస్తున్న వైసీపీ పాలనలో బీసీలకు రక్షణ కరువైందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బచ్చుల బోస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానుమోలు టీడీపీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన జయహో బీసీ (బీసీల ఆత్మీయసమ్మేళనం)లో ఆయన పాల్గొన్నారు.

కానుమోలులో నిర్వహించిన బీసీల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న బచ్చుల బోస్‌

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌, ఏప్రిల్‌ 15 : టీడీపీ హయంలో ప్రవేశ పెట్టిన స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను తగ్గించడం తోపాటే ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టికక్షపూరితంగా వ్యవహరిస్తున్న వైసీపీ పాలనలో బీసీలకు రక్షణ కరువైందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బచ్చుల బోస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కానుమోలు టీడీపీ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన జయహో బీసీ (బీసీల ఆత్మీయసమ్మేళనం)లో ఆయన పాల్గొన్నారు. ముందుగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీలు అనుభవిస్తున్న 34శాతం రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించిన ఘనత వైసీపీదేనని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోని రాగానే ఎన్డీఏ కూటమి ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ బీసీలకు బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందన్నారు. గన్నవరంలో జనసేన, బీజేపీ బలపరచిన టీడీపీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావును అత్య ధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు చెడుగొండి శివశంకర్‌, దయాల రాజేశ్వ రరావు, వేగిరెడ్డి పాపారావు, రాజులపాటి నాగరాజు, చింతల వేంకటశివ అప్పారావు, మజ్జిగ నాగరాజు, చిన్నం శ్రీదేవి, నక్కా నాగరాజు, రొంటే శ్రీమన్నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2024 | 01:04 AM

Advertising
Advertising