ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Venigandla Ramu: బీసీలకు చంద్రబాబు ఎంతో గౌరవం ఇస్తున్నారు

ABN, Publish Date - Mar 06 , 2024 | 05:53 PM

బీసీలకు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎంతో గౌరవం ఇస్తున్నారని గుడివాడ టీడీపీ ఇన్‌చార్జి వెనిగండ్ల రాము(Venigandla Ramu) అన్నారు. బుధవారం నాడు గుడివాడ టీడీపీ కార్యాలయంలో జయహో బీసీ సక్సెస్ మీట్ నిర్వహించారు.

కృష్ణాజిల్లా(గుడివాడ): బీసీలకు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎంతో గౌరవం ఇస్తున్నారని గుడివాడ టీడీపీ ఇన్‌చార్జి వెనిగండ్ల రాము (Venigandla Ramu) అన్నారు. బుధవారం నాడు గుడివాడ టీడీపీ కార్యాలయంలో జయహో బీసీ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు చంద్రబాబు ఇచ్చే గౌరవం, ప్రాధాన్యత ఏంటో సదస్సులో స్పష్టంగా కనిపించిందని అన్నారు. జయహో బీసీ సభ అనుకున్న దానికంటే సక్సెస్ అయ్యిందని.. ప్రజల స్పందన చూసి తామే ఆశ్చర్యపోయామని అన్నారు. జయహో బీసీ సదస్సుతో రాష్ట్రంలోని బీసీలందరూ సమీకృతమేనని టీడీపీకి మద్దతుగా నిలబడ్డారని చెప్పారు.

తమకు ఇంతకంటే ఏం కావాలని, బీసీ సోదరులు అనుకునే విధంగా చంద్రబాబు - పవన్ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్ ప్రకటించారని తెలిపారు. రూ. లక్షా 50వేల కోట్ల బీసీ సబ్ ప్లాన్ చారిత్రాత్మకమని అన్నారు. టీడీపీ - జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని బీసీ సోదరుల స్థితిగతులు సమూలంగా మారుతాయని అన్నారు. బీసీ సోదరుల రాయితీలు తొలగించి, ప్రయోజనాలను హరించిన సీఎం జగన్ ప్రభుత్వం, బీసీలను ఉద్ధరించానని గొప్పలు చెప్పుకుంటుందని చెప్పారు. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం కల్పిస్తానంటూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని వెనిగండ్ల రాము అన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 06 , 2024 | 05:54 PM

Advertising
Advertising