ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సాంకేతిక యాజమాన్యంతో వరిలో అధిక దిగుబడులు

ABN, Publish Date - Jul 31 , 2024 | 12:45 AM

మారుతున్న వాతావరణ పరి స్థితులకు అనుగుణంగా సాంకేతిక సాయంతో తక్కువ ఖర్చుతో అధికదిగు బడులు పొందవచ్చని ఏడీఏ శ్రీనివాస్‌ రైతులకు సూచించారు. వేలేరులో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయం, భూసార పరీక్ష వల్ల ఉపయోగాలను సోదాహరణంగా వివరిం చారు.

ఆధునిక సేద్యంపై రైతులకు అవగాహన కల్పిస్తున్న ఏడీఏ శ్రీనివాస్‌

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌, జూలై 30 : మారుతున్న వాతావరణ పరి స్థితులకు అనుగుణంగా సాంకేతిక సాయంతో తక్కువ ఖర్చుతో అధికదిగు బడులు పొందవచ్చని ఏడీఏ శ్రీనివాస్‌ రైతులకు సూచించారు. వేలేరులో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయం, భూసార పరీక్ష వల్ల ఉపయోగాలను సోదాహరణంగా వివరిం చారు. ఏవోలు పద్మజ, భవాని మాట్లాడుతూ, వరి నాట్లు వేసిన 30 రోజుల్లో కలుపుతీత వంటి సస్యరక్షణ చర్యలతో పాటు ఆరుతడి నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలన్నారు. ఎలుకల నివారణకు సామూహిక పద్ధతి పాటిస్తూ మందు తయారు చేసుకునే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో వేములపల్లి శ్రీనివాసరావు, రైతులు పాల్గొన్నారు.

గ్రామీణ విత్తనోత్పత్తితో రైతులకు ప్రయోజనం

గ్రామీణ విత్తనోత్పత్తి ద్వారా రైతులు పండించిన ధాన్యాన్ని వారే విత్తనాలుగా వాడుకుని ప్రయోజనం పొందవచ్చని ఏడీఎ శ్రీని వాస్‌ సూచించారు. బొమ్ము లూరులో మంగళవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీణ విత్తనోత్పత్తి పథకంపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. రైతులే స్వయంగా పండించిన ధాన్యాన్ని గ్రామంలోని రైతులు ఉపయోగించడం వల్ల విత్తనఖర్చు తగ్గించుకోవచ్చని, నాణ్యమైన విత్తనాలు పొందవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో పద్మజ, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2024 | 12:45 AM

Advertising
Advertising
<