ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వంశీ నామినేషన్‌తో వాహనదారులకు నరకం

ABN, Publish Date - Apr 25 , 2024 | 11:28 PM

గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వల్లభనేని వంశీ గురు వారం నామినేషన్‌ వేయడంతో జాతీయ రహదారిపై వాహనదారులకు ఇక్కట్లు ఎదురయ్యాయి. నామి నేషన్‌ కార్యక్రమానికి నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి జనాన్ని తరలించారు.

జంక్షన్‌ బైపాస్‌ సర్వీస్‌ రోడ్డులో నిలిపివేసిన వాహనాలు

మండుటెండలో అలమటించిన డ్రైవర్లు

పోలీసుల అత్యుత్సాహంపై మండిపాటు

హనుమాన్‌జంక్షన్‌,ఏప్రిల్‌ 25 : గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వల్లభనేని వంశీ గురు వారం నామినేషన్‌ వేయడంతో జాతీయ రహదారిపై వాహనదారులకు ఇక్కట్లు ఎదురయ్యాయి. నామి నేషన్‌ కార్యక్రమానికి నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి జనాన్ని తరలించారు. దీంతో గన్నవరం పట్టణంలో రద్దీ పెరగకుండా విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ సమస్య రాకుండా పోలీస్‌ యం త్రాంగం ముందు జాగ్రత్త చర్యగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు సరుకు రవాణా వాహనాలను జాతీయ రహదారిపైకి అనుమతిం చకపోగా జంక్షన్‌ బైపాస్‌ ప్రాంతంలో జాతీయ రహ దారి వెంబడి ఉన్న సర్వీస్‌ రోడ్డులో పార్కింగ్‌ చే యించారు. దీంతో వాహన డ్రైవర్లు ఆహారం, మంచినీటికి సైతం తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నారు. వీరవల్లి- జంక్షన్‌ మధ్య సర్వీస్‌ రోడ్డులో భారీ ఎత్తును వాహనాలను గన్నవరం వైపు వెళ్లనీయ కుండా నిలిపివేశారు. ప్రయాణికులు ఉండే వాహనాలకు మాత్రమే అనుమతిచ్చి సరుకు రవాణా వాహనాలను సర్వీస్‌ రోడ్డులో నిలిపివేయడంతో డ్రైవర్లు నానా అవస్థలు పడ్డారు. నామినేషన్‌ కారణంగా గంటలకొద్ది వాహనాలను నడిరోడ్డుమీద మండు టెండలో నిలిపి వేయడాన్ని పలువురు డ్రైవర్లు దుయ్యబట్టారు. ఇలా నిర్బంధంగా వాహ నాలను నిలిపివేయడం దుర్మార్గమంటూ పోలీసుల తీరుపై వాహనచోదకులు మండిపడ్డారు.

Updated Date - Apr 25 , 2024 | 11:28 PM

Advertising
Advertising