పోస్టల్ బ్యాలెట్‌కు నేడు చివరిరోజు
ABN, Publish Date - May 08 , 2024 | 12:59 AM
ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా మం గళవారం 750 మంది ఉద్యోగులు ఓటేశారు. 2 వేల మందికి పైగా ఉద్యోగులు తమ ఓటు వేయాల్సి ఉంది. బుధవారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయడానికి చివరి రోజు కావటంతో ఆందోళన నెలకొంది.
ఇంకా ఓటేయని 2 వేల మందికి పైగా ఉద్యోగులు
కామన్ ఫెసిలిటేషన్ సెంటర్లు మూత
ఏ నియోజకవర్గాల వారు అక్కడే ఓటేయాలని అధికారుల నిర్దేశం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఎన్టీఆర్ జిల్లావ్యాప్తంగా మం గళవారం 750 మంది ఉద్యోగులు ఓటేశారు. 2 వేల మందికి పైగా ఉద్యోగులు తమ ఓటు వేయాల్సి ఉంది. బుధవారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేయడానికి చివరి రోజు కావటంతో ఆందోళన నెలకొంది. ఇప్పటికే వీవీఐపీల దగ్గర పనిచేసే పోలీసులకు ఎలక్షన్ కమిషన్ 9వ తేదీన ఓటేసే అవకాశం ఇచ్చింది. దీంతో సాధారణ ఉద్యోగులకు కూడా మరో రోజు గడువు పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం మంగ ళవారం ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కామన్ ఫెసి లిటేషన్ సెంటర్‌ను తీసేశారు. ఫెసిలిటేషన్ సెంటర్లను అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితం చేశారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధి కారి ఆదేశాల మేరకు ఉద్యోగులకు ఎక్కడ ఓటు ఉంటే ఆ నియో జకవర్గంలోనే ఓటేయాలని నిర్దేశించారు. ఐజీఎంసీలో కామన్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను తొలగించటంతో ఓటేయ డానికి వచ్చిన ఉద్యోగులు తుమ్మలపల్లిలో ఉన్న కేంద్రానికి వచ్చారు. తుమ్మలపల్లి కేంద్రాన్ని తొలగించినా అత్యవసర సేవల ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ కోసం పునరుద్ధరించారు. పెద్ద సంఖ్యలో ఉద్యోగులు రావ టంతో వారంతా ఓటేయడానికి వీలవ్వదని, సొంత నియోజకవ ర్గాల్లో ఓటేయాలని పోలింగ్ అధికారులు సూచించారు. అత్యవసర సేవల కిందకు వచ్చే జర్నలిస్టులు, అగ్నిమాపక సిబ్బంది, పోస్టల్, టెలికం, దూరదర్శన్, ఆకాశవాణి ఉద్యోగులు 568 మంది మంగళవారం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు.
ఇప్పటివరకు ప్రశాంతంగా నిర్వహించిన పోస్టల్‌బ్యాలెట్ పోలింగ్ మంగళవారం గందరగోళంగా మారింది. ఫెసిలి టేషన్ కేంద్రాలకు పంపిన జాబితాల్లో పేర్లు లేకపోవటంతో ఉద్యోగులు, పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు.
పోలీసులకు పోలింగ్ అధికారులకు మధ్య వాగ్వివాదం
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కామన్ ఫెసిలి టేషన్ సెంటర్‌కు వచ్చిన పోలీసులకు ఇక్కడ జాబితాలో పేర్లు లేవు. ఎన్నికల సంఘం మార్గదర్శ కాల ప్రకారం ఇక్కడ ఓటు లేకపోతే సొంత నియోజకవర్గాల్లో ఓటేసుకోవచ్చని అధికారులు సూచించారు. తమ సొంత నియోజకవర్గాలకు వెళ్లామని, అక్కడ కూడా లిస్టులో తమ పేర్లు లేవని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ ఓటు ఇక్కడే వేస్తామని గట్టిగా బదులివ్వడంతో పోలీసులు, పోలింగ్ అధికారుల మధ్య కొంత సేపు వాగ్వివాదం జరిగింది. తమ దగ్గర ఉన్న లిస్టుల్లో పేర్లు లేకపోతే తామేమీ చేయలేమని పోలింగ్ అధికారులు చెప్పారు.
పేర్లు లేవని గన్నవరం ఉద్యోగుల ఆందోళన
ఎన్టీఆర్ జిల్లా పరిధిలో విధులు నిర్వహించే కృష్ణాజిల్లా గన్నవరం నియోజ కవర్గానికి చెందిన ఉద్యోగులు ఓటేయ డానికి గన్నవరం నియోజ కవర్గానికి వెళ్లారు. అక్కడ ఓటర్ల జాబితాలో వారి పేర్లు లేవు. దీంతో వారు ఆందోళన వ్యక్తంచేశారు. రిట ర్నింగ్ అధికారితో వాగ్వివాదానికి దిగారు. ఎన్టీఆర్ జిల్లాలో పని చేసే గన్నవరం ప్రాంత ఉద్యోగుల వివరాలను కృష్ణాజిల్లా ఎన్ని కల యంత్రాం గానికి, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం పంపింది. అయినా అక్కడి అధికారులు వారి పేర్లను గన్నవరం ఓటర్ల జాబితాలోకి ఎక్కించ లేదు. దీంతో ఈ సమస్య వచ్చింది. దీనిపై రిటర్నింగ్ అధికారి ఉద్యోగుల పేర్లను నమోదు చేసుకుని ఉన్నతాధికారులతో మాట్లాడి ఓటేసేలా చూస్తామని చెప్పారు. దీంతో వివాదం సమసింది.
Updated Date - May 08 , 2024 | 01:03 AM