ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

ABN, Publish Date - Jul 16 , 2024 | 12:53 AM

వర్షాల కారణంగా దోమలు, ఇతర సూక్ష్మ క్రిముల వల్ల ప్రబలే సీజనల్‌ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగు చర్యలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని నియోజకవర్గ అధికారులను స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ ఆదేశించారు. సోమవారం పోరంకి టీడీపీ కార్యాలయంలో మూడు మండలాల ఎంపీడీఓలు, ఈఓపీ ఆర్డీలు, పీఎస్‌లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌

పెనమలూరు, జూలై 15 : వర్షాల కారణంగా దోమలు, ఇతర సూక్ష్మ క్రిముల వల్ల ప్రబలే సీజనల్‌ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగు చర్యలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని నియోజకవర్గ అధికారులను స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ ఆదేశించారు. సోమవారం పోరంకి టీడీపీ కార్యాలయంలో మూడు మండలాల ఎంపీడీఓలు, ఈఓపీ ఆర్డీలు, పీఎస్‌లతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాల కారణంగా దోమలు ప్రబలే ప్రమాదం ఉంద ని, దోమలు, క్రిముల నిర్మూలనకు ప్రతి వీధిలో ఫాగింగ్‌ చేయాలని ఆదేశించారు. రోడ్లపై, ఖాళీ స్థలాల్లో వర్షపు నీరు నిల్వ ఉండ కుండా శానిటేషన్‌ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. క్రింది స్థాయి సిబ్బంది నుంచి ప్రతి ఒక్కరూ బాధ్యతగా విఽధులు నిర్వహించాలని ఆదేశించారు. గ్రా మాల్లో ఇంటి పన్నులను ప్రభుత్వ నిబంధనల మే రకు విధించాలని కోరారు. గ్రామాల్లో రోడ్లను, ఇతర ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను అరికట్టాలని ఆదేశించారు. కంకిపాడు మండలం దావులూరులోని అసంపూర్తి పనులు, కుందేరు వంతెనకు అప్రోచ్‌ రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

బోర్‌వెల్‌ ప్రారంభం

తాడిగడప మునిసిపాలిటీ యనమలకుదురు పరిధి ఇందిరానగర్‌1లో సోమవారం స్థానిక ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ స్థానికుల నీటి అవసరాల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన బోర్‌వెల్‌ను ప్రారంభించారు. ఐదు లక్షల మునిసిపల్‌ నిధులతో ఏర్పాటు చేసిన బోర్‌వెల్‌ ప్రారంభ కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు అనుమోలు ప్రభాకరరావు, తాతపూడి గణేష్‌, అనంతనేని చంద్రశేఖరాజాద్‌, వెలగపూడి బాబూరావు, మొక్కపాటి శ్రీనివాస్‌, ముప్పవరపు నారాయ ణ, ఇబ్రహీం, సింగం సుబ్రహ్మణ్యం, సంపర శేఖర్‌, తమ్ము అశోక్‌, ధనేకుల భార్గవ్‌, శొంఠి శివరాంప్రసాద్‌, వీరంకి కుటుంబరావు, షకీలా, షాహీనా, పాదాల ప్రభాకరరావు తదితరులు పాల్గొన్నారు.

ఫ యనమలకుదురులోని ఒక నిరుపేద వ్యక్తికి ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ స్థానిక నాయకులు అనంతనేని ఆజాద్‌, ఇబ్రహీంల సహకారం మేరకు జీవనోపాధికి టీ బండిని వితరణగా అందించారు. ఆజాద్‌, ఇబ్రహీంలను ఎమ్మెల్యే అభినందించారు.

Updated Date - Jul 16 , 2024 | 12:53 AM

Advertising
Advertising
<