ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కొత్త సీపీగా రాజశేఖర్‌బాబు

ABN, Publish Date - Jul 12 , 2024 | 01:04 AM

విజయవాడ పోలీసు కమిషనరేట్‌కు కొత్త బాస్‌ రానున్నారు. కమిషనర్‌గా ఎస్వీ రాజశేఖర్‌ బాబును ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌గా ఉన్నారు. రాష్ట్రంలో తొమ్మిది మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఎస్వీ రాజశేఖర్‌బాబు

విజయవాడ, జూలై 11 (ఆంధ్రజ్యోతి) : విజయవాడ పోలీసు కమిషనరేట్‌కు కొత్త బాస్‌ రానున్నారు. కమిషనర్‌గా ఎస్వీ రాజశేఖర్‌ బాబును ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌గా ఉన్నారు. రాష్ట్రంలో తొమ్మిది మంది ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పోలీసు కమిషనర్‌గా ఉన్న పీహెచ్‌డీ రామకృష్ణను డీజీపీ కార్యాలయంలోని ప్రొవిజనింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ విభాగానికి బదిలీ చేశారు. ఎన్నికల సమయంలో రామకృష్ణను ఎన్నికల కమిషన్‌ నియమిం చింది. ఆయన ఏప్రిల్‌ 26వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. సీపీగా 77 రోజులు పనిచేశారు. విజయవాడలో అతి తక్కువకాలం పనిచేసిన కమిషనర్‌ ఈయనే. కొద్దినెలల క్రితం జరిగిన ఎన్నికలను ఎలాంటి హింసాత్మక ఘటనలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించారన్న మార్కును రామకృష్ణ వేసుకున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చినాయుడు కండ్రిగకు చెందిన రాజశేఖర్‌ బాబు 1999లో డీఎస్పీగా పోలీసు శాఖలో చేరారు. తొలుత అనంతపురం జిల్లా ధర్మవరంలో డీఎస్పీగా పనిచేశారు. తర్వాత పార్వతీపురంలో విధులు నిర్వర్తించారు. నంద్యాల ఓఎస్డీగా పనిచేశారు. నాన్‌ కేడర్‌ ఎస్పీగా ఎస్‌ఐబీలో పనిచేశారు. 2006లో ఆయనకు ఐపీఎస్‌ హోదా వచ్చింది. ఎస్పీగా తిరుపతి అర్బన్‌, అనంతపురం, గుంటూరు రూరల్‌, చిత్తూరు ఎస్పీగా పనిచేశారు. 2020లో డీఐజీగా పదోన్నతి పొందారు. ఈ ఏడాది జనవరిలో ఐజీగా పదోన్నతి పొంది పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌గా ఉన్నారు. ఇక ఆయన విజయవాడ పోలీసు చీఫ్‌గా వ్యవహరించబోతున్నారు.

Updated Date - Jul 12 , 2024 | 01:04 AM

Advertising
Advertising
<