ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vijayawada: ఫేస్ బుక్‌లో కేశినేని నాని మరో పోస్ట్

ABN, Publish Date - Jan 08 , 2024 | 07:38 AM

విజయవాడ: త్వరలోనే ఢిల్లీకి వెళ్లి తన లోక్‌సభ సభ్యత్వంతో పాటు తెలుగుదేశం పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని తన ఫేస్ బుక్‌లో మరో పోస్ట్ చేశారు. సోమవారం ఉదయం 10:30 నిమిషాలకు తన కూతురు కేశినేని శ్వేత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి...

విజయవాడ: త్వరలోనే ఢిల్లీకి వెళ్లి తన లోక్‌సభ సభ్యత్వంతో పాటు తెలుగుదేశం పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని తన ఫేస్ బుక్‌లో మరో పోస్ట్ చేశారు. సోమవారం ఉదయం 10:30 నిమిషాలకు తన కూతురు కేశినేని శ్వేత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి... తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తారని, ఆ తర్వాత టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తారని ఆయన పేర్కొన్నారు.

కాగా టీడీపీ అధినేత చంద్రబాబు తన పార్టీకి అవసరం లేదని భావించిన తర్వాత తాను ఆ పార్టీలో కొనసాగడం భావ్యం కాదని భావిస్తున్నట్టు విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. త్వరలోనే ఢిల్లీకి వెళ్లి తన లోక్‌సభ సభ్యత్వంతో పాటు పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. ‘‘చంద్రబాబు నాయుడు గారు పార్టీకి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తున్నాను’’ అని నాని ఎక్స్ వేదికగా తెలిపారు.

మొన్నటి నుంచి కేశినేని నాని సంచలనాలకు తెరదీస్తున్నారు. ఫేస్‌బుక్‌ వేదికగా నిన్న ఎంపీ కేశినేని నాని ఒక పోస్ట్ పెట్టారు. విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇస్తామని చంద్రబాబు చెప్పారని నాని తెలిపారు. ఈ మేరకు తనకు గురువారం సాయంత్రం టీడీపీ నేతల ఆలపాటి రాజా, నెట్టేం రఘురాం, కొనకళ్ళ నారాయణ వచ్చి చెప్పారని వివరించారు. తిరువూరులో చంద్రబాబు పాల్గొనే సభా నిర్వహణ బాధ్యతలను కూడా వేరే వారికి అప్పగించినట్లు చెప్పారని కూడా పేర్కొన్నారు. తనను జోక్యం చేసుకోవద్దని కూడా చెప్పారని నాని తెలిపారు. ఈ క్రమంలోనే నేడు రాజీనామా చేయబోతున్నట్టు ఎక్స్ వేదికగా తెలిపారు.

Updated Date - Jan 08 , 2024 | 07:38 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising