కొత్త కలెక్టర్‌గా సృజన
ABN, Publish Date - Jun 23 , 2024 | 12:51 AM
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీరావు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి గుమ్మళ్ల సృజన కలెక్టర్‌గా రానున్నారు. ప్రస్తుతం ఆమె కర్నూలు జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు.
(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీరావు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో 2013 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి గుమ్మళ్ల సృజన కలెక్టర్‌గా రానున్నారు. ప్రస్తుతం ఆమె కర్నూలు జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సృజన 2015లో కృష్ణాజిల్లా సబ్ కలెక్టర్‌గా చేశారు. ఆమె గ్రేటర్ విశాఖ మున్సిపల్ కమిషనర్‌గా కూడా పనిచేశారు. ఆ సమయంలో కరోనా ప్రబలుతుండగా, ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చి, మెటర్నటీ సెలవు ఉపయోగించుకునే అవకాశం ఉన్నా, తన బిడ్డతో విధులకు హాజరుకావడం అందరి దృష్టినీ ఆకర్షించింది. గుమ్మళ్ల సృజన తండ్రి బలరామయ్య ఐఏఎస్ అధికారి. తల్లి సుగుణశీల గృహిణి. భర్త రవితేజ హైకోర్టు అడ్వకేట్‌గా చేస్తున్నారు. సృజన విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్‌లో జరిగింది. బీఏ సెయింటాన్స్‌లో, ఎంఏ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేశారు. శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. సృజన భర్త రవితేజ ప్రముఖ సోషలిస్టు నాయకుడు వాసిరెడ్డి కృష్ణారావు మనవడు.
Updated Date - Jun 23 , 2024 | 12:52 AM