ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మునిసిపల్‌ చెత్త వ్యాను డ్రైవర్ల సమ్మె విరమణ

ABN, Publish Date - Jun 07 , 2024 | 01:28 AM

గత నెల 20 నుంచి సమ్మె చేస్తున్న మునిసిపల్‌ చెత్త వ్యాను డ్రైవర్లు తాడిగడప మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వరరావు హామీతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు.

అనుమోలు ప్రభాకరరావు సమక్షంలో మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వరరావుకు సమ్మె విరమణ పత్రాన్ని అందిస్తున్న కార్మికులు

పెనమలూరు, జూన్‌ 6: గత నెల 20 నుంచి సమ్మె చేస్తున్న మునిసిపల్‌ చెత్త వ్యాను డ్రైవర్లు తాడిగడప మునిసిపల్‌ కమిషనర్‌ వెంకటేశ్వరరావు హామీతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీ తాడిగడప మునిసిపా లిటీ అఽధ్యక్షుడు అనుమోలు ప్రభాకరరావు ఆధ్వర్యంలో కమిషనర్‌తో సీఐ టీయూ నాయకులు ఉప్పాడ త్రిమూర్తులు, మస్తాన్‌వలి, సరళ, వ్యాను డ్రైవర్లు చర్చలు జరిపాక వ్యాను డ్రైవర్లు సమ్మె విరమించారు. వ్యాను డ్రైవర్ల జీతా లు ప్రతినెలా పదో తేదీకల్లా ఇస్తామని, కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఏర్ప డిన తర్వాత కాంట్రాక్ట్‌ పద్ధతిని తొలిగించి డ్రైవర్లను నేరుగా మునిసిపాలిటీ లోకి తీసుకుంటామని ఇచ్చిన హామీల మేరకు డ్రైవర్లు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రెండు వారాలుగా పేరుకుపోయిన చెత్తతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగనున్నాయి.

Updated Date - Jun 07 , 2024 | 01:28 AM

Advertising
Advertising