ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మలేరియా నిర్మూలనపై అవగాహన

ABN, Publish Date - Apr 25 , 2024 | 11:31 PM

దేశంలో 2027 నాటికి మలేరియా మరణాలు లేకుండా చేయడంతో పాటు 2030 సంవత్సరానికి మలేరియా కేసులు ఉండకూ డదన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వానికి అందరూ సహకరించాలని జిల్లా మలేరియా అధికారి బి. రామారావు అన్నారు.

కాటూరులో మలేరియా నిర్మూలనపై అవగాహన ర్యాలీలో వైద్యసిబ్బంది

ఉయ్యూరు, ఏప్రిల్‌ 25 : దేశంలో 2027 నాటికి మలేరియా మరణాలు లేకుండా చేయడంతో పాటు 2030 సంవత్సరానికి మలేరియా కేసులు ఉండకూ డదన్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రభుత్వానికి అందరూ సహకరించాలని జిల్లా మలేరియా అధికారి బి. రామారావు అన్నారు. మలేరియా డే పురస్కరించుకుని ఉయ్యూరు అర్బన్‌హె ల్త్‌ సెంటర్‌, మండల ప్రాథమిక కేంద్రం ఆధ్వర్యంలో గురు వారం ఉయ్యూరు, కాటూరు, ముదునూరులో మలేరియా వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించి ప్రదర్శన చేసి వ్యాధి సోకకుండా తీసుకోవాలసిన జాగ్రత్త లు తెలియజేశారు. కాటూరు పీహెచ్‌సీ అధికారి శివరామకృష్ణ మాట్లాడుతూ, వ్యాధి వచ్చిన తరువాత చికిత్స చేయించుకోవడం కన్నా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాలలో మురుగునీరు నిల్వకుండా మెరకచే యడం, ప్రతి శుక్రవారం డ్రై డేగా పాటించడం చేయాలన్నారు. దోమకాటుకు గురికాకుండా దోమతెరలు వాడాలని ఉయ్యూరు అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ అధికారి గోపీచంద్‌ అన్నారు. పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించి దోమల వ్యాప్తిని అరికట్టి మలేరియాను పూర్తిగా రూపుమాపాలన్నారు. ఆశావర్కర్లు, వార్డు హెల్త్‌ సెక్రటరీలు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:31 PM

Advertising
Advertising