తిరువూరులో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
ABN, Publish Date - May 19 , 2024 | 12:25 AM
పట్టణంలో భారీ వర్షంపడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శనివారం ఉదయం ఎండవేడిమి అఽధికంగా ఉన్నా మధ్యాహ్నం నుంచి వాతావరణంలో మార్పుచోటుచేసుకొన్నాయి.
తిరువూరు, మే 18: పట్టణంలో భారీ వర్షంపడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. శనివారం ఉదయం ఎండవేడిమి అఽధికంగా ఉన్నా మధ్యాహ్నం నుంచి వాతావరణంలో మార్పుచోటుచేసుకొన్నాయి. సుమారు గంటపాటు భారీ వర్షం కురిసింది. ప్రధాన రహదారిలో డ్రెయిన్లు పొంగి వరదనీరు రహదారుల మీదుగా ప్రవహించింది. పట్టణంలోని టీడీటీ కల్యాణ మండపం రోడ్డులో భారీగా వరదనీరు నిలిచిపోవడంతో, ఈ మార్గంలో రాకపోకలు సాగించేందు వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. మునిసిపల్ పార్కునుంచి టీడీపీ కల్యాణ మండపం వరకు ఆర్‌అండ్‌బీ రహదారి గోతులమయంగా మారడం, వరదనీరు ఈ ప్రాంతంలో భారీగా చేరడంతో, రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడిన ప్రతిసారి ఈ ప్రాంతంలో వరదనీరు చేరుతున్నా అధికారులు ఎటువంటి నివారణ చర్యలు తీసుకోవడంలేదని స్థానికులు విమర్శిస్తున్నారు.
Updated Date - May 19 , 2024 | 12:25 AM