ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైభవంగా తెప్పోత్సవం

ABN, Publish Date - Apr 25 , 2024 | 01:43 AM

దుర్గామల్లేశ్వర స్వామి దేవ స్థానంలో బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా కృష్ణానదిలో బుధవారం గంగ, పార్వతి, మల్లేశ్వరుల ఉత్సవమూర్తుల తెప్పోత్సవ సేవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.

కృష్ణానదిలో తెప్పపై ఊరేగుతున్న గంగ, పార్వతి, మల్లేశ్వరులు

దుర్గగుడిలో ముగిసిన బ్రహ్మోత్సవాలు

వన్‌ టౌన్‌, ఏప్రిల్‌ 24: దుర్గామల్లేశ్వర స్వామి దేవ స్థానంలో బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా కృష్ణానదిలో బుధవారం గంగ, పార్వతి, మల్లేశ్వరుల ఉత్సవమూర్తుల తెప్పోత్సవ సేవ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. పుష్పతోరణాలు, విద్యుల్లతలతో అలంకరించిన తెప్పపై ఉత్సవ మూర్తులను ఉంచి పూజలు చేసిన అనంతరం వేద నివేదన అనంతరం నదిలో ఊరేగించారు. దేవస్థానం ఈవో కేఎస్‌ రామారావు తెలిపారు. స్థానాచార్యుడు శివప్రసాద శర్మ, ఈఈ రమాదేవి, ముఖ్య అర్చకుడు యజ్ఞనారాయణ, వైదికకమిటీ సభ్యులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం వేదోక్త శాస్త్రోక్త విధానంలో పూర్ణాహుతి కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈవో కేఎస్‌ రామారావు దంపతులు పాల్గొన్నారు. లోక శాంతి కలగాలంటూ పూర్ణాహుతిలో ఆహు తులు సమర్పించారు. వేడుకగా ధాన్యకోట్నోత్సవాన్ని, వసంతో త్సవాలను నిర్వహించారు. గంగా, పార్వతి, మల్లేశ్వరుల ఉత్స వమూర్తులను మంగళవాయిద్యాలు, వేద మంత్రాల మధ్య కృష్ణానది వద్దకు తీసుకెళ్లి వైదిక కార్యక్రమాలను నిర్వహించి ఉత్సవమూర్తులకు అవభృద స్నానం చేయించారు. కృష్ణా నదిలో నిర్వహించిన అవభృద స్నానంలో ఈవో రామారావు దంపతులు, స్థానాచార్యుడు శివప్రసాద్‌ శర్మ, ముఖ్య అర్చ కుడు శ్రీనివాసశాస్త్రి, అర్చక సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 01:43 AM

Advertising
Advertising