ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గన్నవరం-ముంబై విమానం రద్దు

ABN, Publish Date - Jul 15 , 2024 | 01:18 AM

గన్నవరం నుంచి ముంబై వెళ్లవలసిన ఎయిర్‌ఇండియా విమానం నిలిచిపోయింది.

ప్రయాణికుల ఆందోళన

గన్నవరం, జూలై 14: గన్నవరం నుంచి ముంబై వెళ్లవలసిన ఎయిర్‌ఇండియా విమానం నిలిచిపోయింది. రోజూ ముంబై నుంచి గన్నవరం విమానాశ్రయానికి సాయంత్రం 5.40 గంటలకు వచ్చి రాత్రి 7.20 గంటలకు వెళుతుంది. ఆదివారం ముంబై నుంచి వచ్చిన విమానం తిరిగి వెళ్లే సమయంలో సాంకేతిక సమస్య వచ్చినట్టు పైలెట్‌ గుర్తించాడు. దీంతో విమానం రద్దుచేసినట్టు అధికారులు తెలిపారు. ముంబైకి 171 మంది ప్రయా ణికులు వెళ్లాల్సి ఉండగా వారిలో చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌ ఉన్నారు. విమానం రద్దు కావడంపై ప్రయాణికులు ఆందోళన చేశారు. తాము ముంబై నుంచి వివిధ దేశాలకు వెళ్లాల్సి ఉందని, మా పరిస్థితి ఏంటని ఎయిర్‌ ఇండియా సిబ్బందిని నిలదీశారు. కొద్దిసేపు విమానా శ్రయంలో గందరగోళం నెలకొంది. కొందరు కార్లలో హైద రాబాద్‌ వెళ్లి అక్కడ నుంచి ప్రత్యామ్నాయ విమానంలో ముంబై వెళ్లేందుకు బయలుదేరారు. ముంబై విమానం రద్దుకావడంతో ప్రయాణికులు లక్షలాది రూపాయలు నష్టపోవాల్సి వచ్చింది.

Updated Date - Jul 15 , 2024 | 01:18 AM

Advertising
Advertising
<