ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Dadi Veerabhadrarao: వైసీపీకి షాక్.. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా

ABN, Publish Date - Jan 02 , 2024 | 03:28 PM

Andhrapradesh: వైసీపీకి గట్టి షాక్ తగిలింది. వైసీపీకి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు రాజీనామా చేశారు. మంగళవారం తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి దాడి పంపించారు. తన అనుచరులతో కలిసి పార్టీని వీడుతున్నట్లు ఏకవాక్యంతో రాజీనామా లేఖ రాశారు.

అమరావతి: వైసీపీకి (YCP) గట్టి షాక్ తగిలింది. వైసీపీకి మాజీ మంత్రి దాడి వీరభద్రరావు (Former Minister Dadi Veerabhadra Rao) రాజీనామా చేశారు. మంగళవారం తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి (CM YS Jaganmohan Reddy) వీరభద్రరావు పంపించారు. తన అనుచరులతో కలిసి పార్టీని వీడుతున్నట్లు ఏకవాక్యంతో రాజీనామా లేఖ రాశారు. సీఎంతో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy), ఎంపీ విజయసాయిరెడ్డికి (MP Vijayasai Reddy)రాజీనామా లేఖను పంపించారు.

రాజీనామాకు ముందు అనకాపల్లిలో వీరభద్రరావు తన వర్గీయులతో సమావేశమయ్యారు. అనంతరం అధికారికంగా తన రాజీనామా లేఖకు సీఎం జగన్‌ను పంపించారు. రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే ప్రకటన ఉంటుందని.. ఏ పార్టీలో చేరేది అప్పుడు చెబుతామని దాడి వీరభద్రరావు ప్రకటించారు.


కాగా.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సీనియర్ నేతగా ఉన్న దాడి వీరభద్రరావు.. తెలుగుదేశం తరపున నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. అయితే అనూహ్యంగా 2014 ముందు వైసీపీలో చేరిన దాడి వీరభద్రరావు.. ఆ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో పార్టీని వీడారు. ఆ తరువాత పలుమార్లు జగన్‌పై విమర్శలు కూడా చేశారు. ఆపై రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. జగన్‌పై అనేక విమర్శలు చేసిన దాడి.. తిరిగి 2019 ఎన్నికల ముందు మరోసారి వైసీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక దాడికి ఎలాంటి కీలక బాధ్యతలు దక్కలేదు. ఈ క్రమంలో ఆయన వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. చివరకు మరో మూడు నెలల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు రానున్న తరుణంలో దాడి వీరభద్రరావు వైసీపీని వీడటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 02 , 2024 | 03:43 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising