ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అనుమానం పెనుభూతమై..

ABN, Publish Date - May 19 , 2024 | 12:52 AM

పదిహేడేళ్ల పాటు కాపురం చేసిన భార్యను రోకలిబండతో అతికిరాతకంగా హతమార్చాడు ఓ భర్త. బందరు మండలం బొర్రపోతుపాలెం గ్రామంలో శనివారం జరిగిన ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. ఆర్‌పేట సీఐ శ్రీనివాసరావు కథనం ప్రకారం..

రోకలి బండతో కొట్టి భార్యను హతమార్చిన భర్త

బందరు మండలం బొర్రపోతుపాలెంలో ఘటన

మచిలీపట్నం టౌన్‌, మే 18 : పదిహేడేళ్ల పాటు కాపురం చేసిన భార్యను రోకలిబండతో అతికిరాతకంగా హతమార్చాడు ఓ భర్త. బందరు మండలం బొర్రపోతుపాలెం గ్రామంలో శనివారం జరిగిన ఈ హత్య స్థానికంగా కలకలం రేపింది. ఆర్‌పేట సీఐ శ్రీనివాసరావు కథనం ప్రకారం.. బొర్రపోతుపాలెం గ్రామానికి చెందిన శివనాగరాజుకు, జింజేరు గ్రామానికి చెందిన శివనాగరాణి (36)తో పదిహేడేళ్ల కిందట వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. రోజువారీ కూలీ చేసుకుంటూ జీవిస్తున్నారు. మొదటి నుంచి భార్యపై అనుమానంతో ఉన్న శివనాగరాజు శనివారం మరింత రెచ్చిపోయాడు. శనివారం మధ్యాహ్నం కుమార్తెతో కలిసి నిద్రపోతున్న నాగరాణిని విచక్షణారహితంగా రోకలిబండతో కొట్టాడు. కుమార్తె అనిత వద్దని వారించినా వినిపించుకోలేదు. కాళ్లు పట్టుకుని బతిమాలినా అనితను తోసేసి మరీ హత్య చేశాడు. కాగా, వీరి పెద్ద కుమార్తె అనిత బుద్దాలపాలెం హైస్కూల్‌లో 10వ తరగతిలో స్కూల్‌ ఫస్ట్‌ వచ్చింది. రెండో కుమార్తె కవిత బుద్దాలపాలెం హైస్కూల్‌లో 8వ తరగతి, కుమారుడు అర్జునరావు బొర్రపోతుపాలెం స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్నాడు. తల్లి మరణంతో వీరు గుండలవిసేలా ఏడ్చారు. కాగా, సంఘటనా స్థలాన్ని డీఎస్పీ ఎండీ అబ్దుల్‌ సుభాన్‌, సీఐ శ్రీనివాసరావు, రూరల్‌ ఎస్‌ఐ వీరప్రసాద్‌ పరిశీలించారు. శివనాగరాణి తల్లి ఆదిలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - May 19 , 2024 | 12:52 AM

Advertising
Advertising