ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బదిలీల్లో ఉద్యోగుల అభ్యర్థనలకు ప్రాధాన్యమివ్వాలి

ABN, Publish Date - Aug 24 , 2024 | 01:42 AM

బదిలీల్లో ఉద్యోగుల అభ్యర్థనను పరిగణనలోనికి తీసుకోవాలని అనారోగ్యంతో ఇబ్బం దులు పడుతున్న ఉద్యోగుల అభ్యర్థ నకు ప్రాధాన్యం ఇవ్వాలని రవాణా శాఖ సంయుక్త కమిషనర్‌ ఎన్‌.శివరామప్రసాద్‌ను రవాణా శాఖ ఉద్యోగుల సంఘం జోనల్‌ అధ్యక్షుడు ఎం.రాజు బాబు, కార్యదర్శి కేవీవీ నాగమురళి కోరారు.

రవాణా శాఖ సంయుక్త కమిషనర్‌ శివరామప్రసాద్‌కు వినతిపత్రమిస్తున్న రాజుబాబు, నాగమురళి

కృష్ణలంక, ఆగస్టు 23: బదిలీల్లో ఉద్యోగుల అభ్యర్థనను పరిగణనలోనికి తీసుకోవాలని అనారోగ్యంతో ఇబ్బం దులు పడుతున్న ఉద్యోగుల అభ్యర్థ నకు ప్రాధాన్యం ఇవ్వాలని రవాణా శాఖ సంయుక్త కమిషనర్‌ ఎన్‌.శివరామప్రసాద్‌ను రవాణా శాఖ ఉద్యోగుల సంఘం జోనల్‌ అధ్యక్షుడు ఎం.రాజు బాబు, కార్యదర్శి కేవీవీ నాగమురళి కోరారు. నగరంలోని రవాణాశాఖ కార్యా లయంలో శుక్రవారం శివరామప్రసాద్‌ను వారు కలిసి వినతి పత్రం అందించారు. అనారోగ్య సమస్యలతో కొంతమంది ఉద్యోగులు వారి కుటుంబసభ్యులు బాధపడు తున్నారని వారు కోరుకున్న హాస్పిటల్స్‌లో చికిత్స పొందేందుకు, వారు కోరుకున్న చోటకు బదిలీ చేయాలని కోరారు. ఏడాదిలోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘా ల్లోని సంఘం కార్యవర్గసభ్యులైన ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా బదిలీల ప్రక్రియను నిర్వహిస్తామని, ఉద్యోగులకు న్యాయం జరిగేలా పారదర్శకంగా బదిలీలు చేస్తామని సంయుక్త కమిషనర్‌ శివరామప్రసాద్‌ తెలిపారు.

Updated Date - Aug 24 , 2024 | 01:42 AM

Advertising
Advertising
<