తూర్పు బైపాస్‌పై ప్రతిష్టంభన
ABN, Publish Date - Jun 26 , 2024 | 01:05 AM
వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా విజయవాడ తూర్పు బైపాస్ ప్రాజెక్టు మూలన పడింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నపుడు వెస్ట్ బైపాస్‌తో పాటుగా తూర్పు బైపాస్ ప్రాజెక్టుకు కూడా కేంద్రానికి ప్రతిపాదించింది. రాజధాని అవుటర్ రింగ్ రోడ్డు నేపథ్యంలో, ఈ ప్రాజెక్టు ప్రతిపాదన ముందుకు కదల్లేదు. అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును కొనసాగిస్తూనే విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డుపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మచిలీపట్నం - హైదరాబాద్ మార్గంలో రాకపోకలు సాగించటానికి, విజయవాడ వెలుపల నుంచి గుంటూరుకు రాకపోకలు సాగించే భారీ వాహనాల ట్రాఫిక్ రద్దీని తగ్గించటానికి తక్కువ ఖర్చులో విజయవాడ తూర్పు బైపాస్ ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టుకు పెద్దగా ఖర్చు, సమయం కూడా పట్టే అవకాశాలు ఉండవు.
వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టు
గత టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదించిన అలైన్‌మెంట్‌కు అడ్డగోలుగా మార్పు
డీపీఆర్ సిద్ధమైనా ముందుకు సాగని రహదారి పనులు
మంగళగిరి నియోజకవర్గం మీదుగానే సింహభాగం రాకపోకలు
కూటమి ప్రభుత్వం దృష్టి పెడితేనే ప్రాధాన్యమైన తూర్పు బైపాస్ పనులు సాగేది
వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా విజయవాడ తూర్పు బైపాస్ ప్రాజెక్టు మూలన పడింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నపుడు వెస్ట్ బైపాస్‌తో పాటుగా తూర్పు బైపాస్ ప్రాజెక్టుకు కూడా కేంద్రానికి ప్రతిపాదించింది. రాజధాని అవుటర్ రింగ్ రోడ్డు నేపథ్యంలో, ఈ ప్రాజెక్టు ప్రతిపాదన ముందుకు కదల్లేదు. అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును కొనసాగిస్తూనే విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డుపై కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మచిలీపట్నం - హైదరాబాద్ మార్గంలో రాకపోకలు సాగించటానికి, విజయవాడ వెలుపల నుంచి గుంటూరుకు రాకపోకలు సాగించే భారీ వాహనాల ట్రాఫిక్ రద్దీని తగ్గించటానికి తక్కువ ఖర్చులో విజయవాడ తూర్పు బైపాస్ ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్టుకు పెద్దగా ఖర్చు, సమయం కూడా పట్టే అవకాశాలు ఉండవు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : వైసీపీ ప్రభుత్వం అమరావతి అవుటర్ రింగ్ రోడ్డును పక్కన పెట్టిన తర్వాత.. విజయవాడ తూర్పు బైపాస్‌ను తెరమీదకు తెచ్చినా.. దీని అలైన్‌మెంట్‌ను మార్చింది. వైసీపీ ప్రభుత్వ పెద్దలు భారీ ఎత్తున గన్నవరం వైపు భూములు కొని ఉన్నారు. మాజీ మంత్రి, ఆయన అనుచరులకు సంబంధించిన వెంచర్లు, స్థానిక ప్రజాప్రతినిధులకు సంబంధించిన వెంచర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం మీదుగా ఈస్ట్ బైపాస్ అలైన్‌మెంట్‌ను మార్చేలా ఒత్తిళ్లు తీసుకొచ్చారు. దీంతో చిన్న అవుటపల్లి నుంచి మొదలు కావాల్సిన తూర్పు బైపాస్‌ను పొట్టిపాడు టోల్‌ప్లాజా దగ్గర నుంచి మొదలయ్యేలా అలైన్‌మెంట్ మార్పించారు. డీపీఆర్‌లో ఇచ్చిన ఆప్షన్లలో దీనినే ప్రాతిపదికగా తీసుకున్నారు. ఈ ప్రతిపాదనే కేంద్రానికి వెళ్లింది. కాబట్టి టీడీపీ ప్రభుత్వం ఈ అలైన్‌మెంట్‌పై పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత వెస్ట్ బైపాస్ నుంచి చూస్తే చిన్న అవుటపల్లి నుంచి గతంలో టీడీపీ ప్రతిపాదించిన అలైన్‌మెంట్‌నే పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కృష్ణానది మీద చోడవరం దగ్గర ఒక బ్రిడ్జి వస్తుంది. ఈ ప్రాజెక్టును గట్టిగా రెండేళ్లలో పూర్తి చేయొచ్చు.
సింహభాగం మంగళగిరి నియోజకవర్గంలోకి వస్తుంది..
విజయవాడ ఈస్ట్ బైపాస్ రోడ్డు కృష్ణాజిల్లాలో చిన్న అవుటపల్లి నుంచి చోడవరం వరకు ఉంటే.. గుంటూరు జిల్లాలో మరీ ముఖ్యంగా మంగ ళగిరి నియోజకవర్గంలో పాతూరు, చిర్రావూరుల మధ్యన ప్రారంభమై కాజ దగ్గర ముగుస్తుంది. గుంటూరు జిల్లాలో ఈ ప్రాజెక్టు సింహభాగం మంగళగిరి నియోజకవర్గం నుంచే సాగుతూ ఉంటుంది కాబట్టి.. ఈ కేంద్ర ప్రాయోజిత విజయవాడ తూర్పు బైపా్‌సను చేపట్టేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. మంగళగిరి నియోజకవర్గంలో కాజ దగ్గరే విజయవాడ వెస్ట్ బైపా్‌సకు అనుసంధానంగా ప్యాకేజీ - 4లో భాగంగా కృష్ణానది బ్రిడ్జి, దీనికి అనుసంధానమయ్యే రోడ్డు కూడా కలుస్తుంది. కాజ దగ్గర ఎన్‌హెచ్ - 65 దగ్గర అటు వెస్ట్ బైపాస్, ఇటు ఈస్ట్ బైపా్‌సలు అనుసంధానమయ్యే చోట భారీ జంక్షన్ ఏర్పడుతుంది. ఈ అవకాన్ని టీడీపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని ప్రజలు కోరుకుంటున్నారు.
లాజిస్టిక్ పార్క్ భూముల సంగతి తేల్చాలి..
లాజిస్టిక్ పార్క్‌ను కేంద్రం గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే చివర్లో మంజూరు చేసింది. విజయవాడ తూర్పు బైపాస్ ప్రాజెక్టును మంజూరు చేయటానికి కేంద్ర ప్రభుత్వం లాజిస్టిక్ పార్క్‌కు ప్రతిగా భూములు కేటాయించాలని కోరింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో వచ్చింది కాబట్టి దీనిపై వైసీపీ ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. కేంద్రం పదేపదే కోరితే.. అమరావతిలో ఒకసారి భూములు ఇస్తామన్నారు. అమరావతిలో లాజిస్టిక్ పార్కును ఏర్పాటు చేయలేమని, రైలు, రోడ్డు మార్గాలకు దగ్గర్లో ఉన్నచోట మాత్రమే భూములు కావాలని కోరితే.. ఆ తర్వాత ప్రభుత్వం స్పందించలేదు. దీంతో విజయవాడ తూర్పు బైపాస్ ప్రాజక్టు ప్రతిష్టంభనలో పడింది.
Updated Date - Jun 26 , 2024 | 01:05 AM