జక్కంపూడి కాలనీలో కార్డెన్ సెర్చ్
ABN, Publish Date - May 25 , 2024 | 12:17 AM
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సార్వత్రిక ఎన్నికల లెక్కింపు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా డీసీపీ హరికృష్ణ పర్యవేక్షణలో శుక్రవారం జక్కంపూడి హౌసింగ్ కాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
జక్కంపూడి కాలనీలో కార్డెన్ సెర్చ్
ఫరికార్డులు లేని 3 ఆటోలు,
25 ద్విచక్రవాహనాలు స్వాధీనం
జక్కంపూడి కాలనీని జల్లెడపట్టిన పోలీసులు
చిట్టినగర్, మే 24: ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సార్వత్రిక ఎన్నికల లెక్కింపు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా డీసీపీ హరికృష్ణ పర్యవేక్షణలో శుక్రవారం జక్కంపూడి హౌసింగ్ కాలనీలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలో పోలీసులు బృందాలుగా విడిపోయి బ్లాక్‌లను తనిఖీలు చేశారు. ప్రతి వాహనాన్ని ఆపి రికార్డులు తనిఖీ చేశారు. పోలీసులు బ్లాక్‌లకు వెళ్లి అక్కడ ప్రజలను సమస్యలు అడగటంతోపాటు అనుమానితుల వివరాలను, స్థానికుల ఇబ్బందులను తెలుసుకున్నారు. అనుమానితులందరిని ఐరిష్ తీయించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను గుర్తించి ఆరా తీశారు. ఆయా ప్రాంతంలో ఉన్న రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లు ఏం చేస్తున్నారు, వివాదాలకు దిగుతున్నారా అనే అంశంపై దృష్టి సారించారు. రికార్డులు లేని 3 ఆటోలను, 25 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీపీ మురళీకృష్ణరెడ్డి కాలనీ ప్రాంతంలోని బ్లాక్‌లలో నివాసితులను పిలిచి అక్కడ ఇబ్బందులు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఇంటి పరసరాలలో కొత్త వ్యక్తులు కనిపిస్తే 100కు కాల్ చేయాలని, నాలుగు నిమిషాలలో పోలీసులు మీ దగ్గరకు వస్తారని తెలిపారు. అల్లరిమూకలు, గంజాయి, మద్యం తదితర వాటిని తాగి అల్లర్లు చేస్తే కఠిన శిక్షలు తప్పవని యువకులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట పోలీస్‌స్టేషన్ సీఐ గణేష్ పలువురు ఎస్సైలు, హెడ్ కానిస్టేబుల్స్. పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 25 , 2024 | 12:17 AM