ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సెంట్రల్‌లో బొండా ఉమా, సీహెచ్‌ బాబూరావు నామినేషన్లు

ABN, Publish Date - Apr 20 , 2024 | 01:12 AM

సెంట్రల్‌ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా బొండా ఉమా, సీపీఎం అభ్యర్థిగా సీహెచ్‌ బాబూరావు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు.

ఆర్వో స్వప్నిల్‌ దినకర్‌కు నామినేషన్‌ పత్రాలు అందజేస్తున్న బొండా ఉమా

విజయవాడ, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): టీడీపీ సెంట్రల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బొండా ఉమామహేశ్వరరావు శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. సెంట్రల్‌ నియోజకవర్గం రిటర్నింగ్‌ అధికారి అయిన వీఎంసీ కమిషనర్‌ స్వప్నిల్‌ దినక ర్‌కు ఈ నామినేషన్‌ పత్రాన్ని ఆయన అందజేశారు. ఉమా వెంట ఆయన కుమారుడు సిద్ధార్థ ఉన్నారు.

ర్యాలీగా వెళ్లి..

వన్‌టౌన్‌: సీపీఎం సెంట్రల్‌ నియోజకవర్గ అభ్యర్థిగా ఇండియా కూటమి బలపరచిన చిగురు పాటి బాబూరావు అట్టహాసంగా శుక్రవారం నామి నేషన్‌ దాఖలు చేశారు. పైపుల రోడ్డు నుంచి రెడ్‌ ఫ్లాగ్‌లు ధరించిన వలంటీర్లు సీపీఎం శ్రేణులతో కలిసి ధర్నాచౌక్‌ వరకు ర్యాలీగా వెళ్లారు. ఎంబీ భవన్‌కు వెళ్లి అక్కడి నుంచి వీఎంసీ కార్యాలయం లోని సెం ట్రల్‌ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం వరకు వెళ్లి అక్కడ నామినేషన్‌ వేశారు. ర్యాలీలో సీపీఎం రాష్ట్ర నాయకుడు పి.మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు పరమేశ్వరరావు, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, రైతు సంఘాల సమాఖ్య కన్వినర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు, కాం గ్రెస్‌ నాయకులు సుంకర పద్మశ్రీ, గురునాథం, నర సింహారావు పాల్గొన్నారు. విద్యార్థి దశ నుంచి అనేక పోరాటాలు చేసిన బాబూ రావును చట్టసభలకు పంపిస్తే పేదల సమస్యలు పరిష్కారమవుతాయని వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దోనేపూడి కాశీనాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 01:12 AM

Advertising
Advertising