ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కాంగ్రెస్‌ నేత అదృశ్యం కేసులో ముందడగు

ABN, Publish Date - Apr 26 , 2024 | 12:19 AM

తెలంగాణా రాష్ట్రం సూర్యాపేట బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య అదృశ్యం కేసులో జగ్గయ్యపేట పోలీసులు ముందడుగు వేశారు. గురువారం జాతీయ రహదారిపై పెనుగంచిప్రోలు మండల పరిధిలో ఒక కర్మాగారం గోడ పక్కన నిలిపిన కారును గుర్తించా రు.

జగ్గయ్యపేట, ఏప్రిల్‌ 25 : తెలంగాణా రాష్ట్రం సూర్యాపేట బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వడ్డే ఎల్లయ్య అదృశ్యం కేసులో జగ్గయ్యపేట పోలీసులు ముందడుగు వేశారు. గురువారం జాతీయ రహదారిపై పెనుగంచిప్రోలు మండల పరిధిలో ఒక కర్మాగారం గోడ పక్కన నిలిపిన కారును గుర్తించా రు. ఎల్లయ్య ఈ నెల 18న ఒక కేసులో మధ్య వర్తిత్వానికి అపర్ణ అనే మహిళతో టీఎస్‌.29 బి 9495 నెంబరు కారులో జగ్గయ్యపేట రావటం, డబ్బులిస్తానని శ్రీనివాస్‌ అనేవ్యక్తి కారులో తీసుకెళ్లటం, ఆ తర్వాత అపర్ణ కూడా అదృశ్యం కావటం, ఎల్లయ్యతో వచ్చిన స్నేహితుడు అంజయ్య కుటుంబ సభ్యులకు తెలియజేయటంతో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. సూర్యాపేట, జగ్గయ్యపేట పోలీసులు నిందితుల కోసం తొమ్మిది ప్రత్యేక బృందాలు గాలిస్తున్న విషయం తెలిసిందే. కాగా గురువారం కర్మాగారం సమీపంలో కారు ఉన్నట్టు పోలీసులకు సమాచారం రావటంతో వెళ్లి స్వాధీనం చేసుకున్నారు. వారం క్రితం అదృశ్యం కాగా కారు ఇప్పుడు వెలుగులోకి రావటం, తాజాగా కారు ఇప్పుడే ఉంచారా? లేదా అప్పటి నుంచి హైవేపై ఉంటే ఎందుకు పోలీసులు గమనించ లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే కేసు మిస్టరిని ఛేదిస్తామని జగ్గయ్యపేట పోలీసులు చెబుతున్నారు. కారు సూర్యాపేటకు చెందిన కలప వ్యాపారిదిగా చెబుతున్నారు.

Updated Date - Apr 26 , 2024 | 12:19 AM

Advertising
Advertising