ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కొత్త సీపీ బాధ్యతల స్వీకరణ

ABN, Publish Date - Apr 25 , 2024 | 11:57 PM

ఎన్టీఆర్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు కొత్త కమిషనర్‌గా పీహెచ్‌డీ రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శనం చేసుకున్న ఆయన.. ఆ తర్వాత కార్యాలయానికి వచ్చారు. ఆయనకు డీసీపీలు, ఏసీపీలు స్వాగతం పలికారు. డీసీపీ కంచి శ్రీనివాసరావు ఆయనకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం డీసీపీలతో సమావేశం నిర్వహించారు.

విజయవాడ, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి) : ఎన్టీఆర్‌ పోలీస్‌ కమిషనరేట్‌కు కొత్త కమిషనర్‌గా పీహెచ్‌డీ రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శనం చేసుకున్న ఆయన.. ఆ తర్వాత కార్యాలయానికి వచ్చారు. ఆయనకు డీసీపీలు, ఏసీపీలు స్వాగతం పలికారు. డీసీపీ కంచి శ్రీనివాసరావు ఆయనకు బాధ్యతలు అప్పగించారు. అనంతరం డీసీపీలతో సమావేశం నిర్వహించారు. నగరంలో, రూరల్‌ పరిధిలో ఉన్న పరిస్థితులను తెలుసుకున్నారు. ఎక్కడెక్కడ అల్లర్లు జరిగే ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో తెలుసుకున్నారు. డీసీపీలు అధిరాజ్‌సింగ్‌ రాణా, టి.హరికృష్ణ, ట్రాఫిక్‌ డీసీపీ కె.చక్రవర్తి, స్పెషల్‌ బ్రాంచ్‌ ఏడీసీపీ కనకరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కమిషనరేట్‌ పరిధిలోని ఇన్‌స్పెక్టర్లు కొత్త సీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్త కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన రామకృష్ణ.. ఆ తర్వాత డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని కలిశారు.

Updated Date - Apr 25 , 2024 | 11:57 PM

Advertising
Advertising