కన్ఫర్డ్ ఐఏఎస్‌ల జాబితాపై న్యాయవిచారణ చేయాలి
ABN, Publish Date - May 26 , 2024 | 12:52 AM
కన్ఫర్డ్ ఐఏఎస్ హోదా కోసం ప్రభుత్వం రూపొందించి యూపీ పీఎస్సీకి పంపిన జాబితాపై న్యాయవిచారణ చేయిం చాలని కాంగ్రెస్ నగర కమిటీ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ నేత నరసింహారావు డిమాండ్
విజయవాడ, మే 24(ఆంధ్రజ్యోతి): కన్ఫర్డ్ ఐఏఎస్ హోదా కోసం ప్రభుత్వం రూపొందించి యూపీ పీఎస్సీకి పంపిన జాబితాపై న్యాయవిచారణ చేయిం చాలని కాంగ్రెస్ నగర కమిటీ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు డిమాండ్ చేశారు. మొత్తం పది మంది పేర్లను ప్రతిపాదించగా, అందులో ఐదుగురు ఒకే సామాజికవర్గానికి, ఒకే జిల్లాకు చెందిన వారు ఉండడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివల్ల అర్హతలు ఉన్న అధికారులకు అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. దీనిపై పూర్తిస్థాయిలో న్యాయవిచారణ జరి పించాలని డిమాండ్ చేశారు.
Updated Date - May 26 , 2024 | 12:52 AM