Ram Mohan Naidu: రామ్మోహన్ నాయుడుకి కీలక శాఖ కేటాయించిన మోదీ
ABN, Publish Date - Jun 10 , 2024 | 07:34 PM
నరేంద్ర మోదీ సారధ్యంలో ఆదివారం నూతనంగా ఏర్పడిన కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడికి కీలక మంత్రిత్వశాఖ దక్కింది. పౌర విమానయాన మంత్రిత్వశాఖను ఆయనకు ప్రధాన మోదీ కేటాయించారు.
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సారధ్యంలో ఆదివారం నూతనంగా ఏర్పడిన కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడికి కీలక మంత్రిత్వశాఖ దక్కింది. పౌర విమానయాన మంత్రిత్వశాఖను ఆయనకు ప్రధాన మోదీ కేటాయించారు. దీంతో రామ్మోహన్ నాయుడికి కేబినెట్ హోదా లభించింది.
రామ్మోహన్ రాజకీయ ప్రస్థానం ఇదే..
శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు మూడు సార్లు గెలిచారు. కేంద్ర మంత్రిగా ఢిల్లీలో ఆయన ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కేంద్రమంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు రోడ్డుప్రమాదంలో మృతి చెందడంతో అనూహ్యంగా రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2013లో జిల్లా అంతటా సైకిల్ యాత్ర చేపట్టి టీడీపీ కార్యకర్తలు, నాయకుల్లో కొత్త ఉత్తేజం తెచ్చారు. 2014లో శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి తొలి దఫా పోటీచేసి అనూహ్య మెజార్టీతో గెలుపొందారు. అలాగే పార్లమెంట్‌లో శ్రీకాకుళం జిల్లా ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ.. తెలుగురాష్ట్రాల సమస్యలను కూడా పార్లమెంట్‌లో చర్చిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. 2019లో శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐదు చోట్ల టీడీపీ అభ్యర్థులు ఓటమిచెందినా కొద్దిపాటి మెజార్టీతో రామ్మోహన్‌నాయుడు గెలుపును అందుకున్నారు. 2024 ఎన్నికల్లో జిల్లాలో గతంలో ఎవరికీ లభించనంతగా బంపర్ మెజార్టీతో మూడోదఫా ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పొత్తులో భాగంగా రామ్మోహన్‌నాయుడి ప్రతిభను గుర్తించిన చంద్రబాబునాయుడు కేంద్రమంత్రి పదవికి సూచించారు. దీంతో ఆదివారం కేంద్రమంత్రిగా రామ్మోహన్‌నాయడు పదవీబాధ్యతలు చేపట్టారు.
Updated Date - Jun 10 , 2024 | 08:15 PM