ప్రపంచ వాతావరణ సంక్షోభం తగ్గించేందుకు చెట్లు కీలకం
ABN, Publish Date - Jul 12 , 2024 | 11:46 PM
ప్రపంచ వాతావరణ సంక్షోభాన్ని తగ్గించడంలో చె ట్లు కీలకమని కడప డీఎ్‌ఫవో సందీ్‌పరెడ్డి తెలిపారు.
మాట్లాడుతున్న డీఎ్‌ఫఓ సందీ్‌పరెడ్డి
కడప (ఎడ్యుకేషన), జూలై 12 : ప్రపంచ వాతావరణ సంక్షోభాన్ని తగ్గించడంలో చె ట్లు కీలకమని కడప డీఎ్‌ఫవో సందీ్‌పరెడ్డి తెలిపారు. శుక్రవారం కడప నగరం నిహార్ స్కిల్ ఎడ్యుకేషన సెంటరులో మాస్టరు ట్రైనర్లకు ఐదురోజుల శిక్షణ కార్యకమ్రం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యకమ్రం పార్రంబించిన ఆయన చెట్లు మన జీవితాల్లో కలిగించే ప్రాధాన్యత, ఆగ్రో ఫారెస్టింగ్ పద్దతుల ద్వారా రైతులకు కలుగు ప్రయోజనాలు వివరించారు. అలగే పరిశ్రమలో కలప పామ్రుఖ్యతను కలప సరఫరా డిమాండ్లు వివరించారు. ఈ కార్యక్రమంలో టోఫీ బృందం స్టేట్ కోఆర్డినేటరు ఎ.అజిత, స్టేట్ అసోసియేట్ కె.సతీష్, కేవీ జయంత, జి.ప్రవీణ్‌లు పాల్గొన్నారు.
Updated Date - Jul 13 , 2024 | 12:01 AM